సికింద్రాబాద్: రంజీ ట్రోఫీ సీజన్‌ను హైదరాబాద్ జట్టు విజయంతో మొదలుపెట్టింది. బౌలింగ్‌లో తనయ్ త్యాగరాజన్ (6/52), మహ్మద్ సిరాజ్ (2/19).. త్రిపురను కట్టడి చేయడంతో మూడు రోజుల్లోనే ముగిసిన ఎలైట్ గ్రూప్–బి మ్యాచ్‌లో హైదరాబాద్ ఇన్నింగ్స్ 40 రన్స్ తేడాతో విజయం సాధించింది. దాంతో బోనస్‌తో కలిపి ఏడు పాయింట్లను ఖాతాలో వేసుకుంది.
99/7 ఓవర్‌నైట్ స్కోరుతో మంగళవారం ఆట కొనసాగించిన త్రిపుర రెండో ఇన్నింగ్స్‌లో 41.2 ఓవర్లలో 120 రన్స్‌కు ఆలౌటైంది. తొలి సెషన్లో 8.2 ఓవర్లలోనే త్రిపురలో మిగిలిన మూడు వికెట్లను తనయ్ తీశాడు. ముందుగా ఓవర్‌నైట్ బ్యాటర్ సెంటు సర్కార్ (27)ను, ఆ తర్వాత వరుస విరామాల్లో పర్వేజ్ సుల్తాన్ (15), సందీప్ సర్కార్ (0)ను పెవిలియన్‌కు పంపి హైదరాబాద్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఈ నెల 18 నుంచి జరిగే రెండో మ్యాచ్‌లో హైదరాబాద్.. ఆంధ్రతో తలపడుతుంది.
