అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త ప్రెస్ సెక్రటరీ కేటీ జకారియా చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఆమె తొలి ప్రెస్ బ్రీఫ్ లోనే ట్రంప్ తన భర్త అంటూ కామెంట్స్ చేయడం సోషల్ మీడియాలో ట్రెండిండ్ టాపిక్ గా మారింది. 2026 అక్టోబర్ 13 (సోమవారం) ట్రంప్ సెషన్ పూర్తియినత తర్వాత 14 నిమిషాలు ఇచ్చిన ప్రెస్ బ్రీఫింగ్ లో ఈ వ్యాఖ్యలు చేశారు.
వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ అనేది చాలా డిమాండింగ్ రోల్.. అలాంటిది ఫ్యామిలీ, పిల్లలను, జాబ్ ను ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు అంటూ ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు.. ట్రంప్ ను తన హస్బెండ్ గా పొరపాటున అనేశారు.
వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ అంటే హై ప్రెజర్ జాబ్.. పిల్లలతో టైమ్ స్పెండ్ చేయడానికి వీలవుతుందా అని డైలీ మెయిల్ కరస్పాండెంట్ ఆమెను అడిగారు. పాలిటిక్స్ లో ఉన్న మహిళలకు ఇది కామన్ ప్రశ్నే . అయితే ఆమె కన్ఫ్యూజన్ లో నోరు జారారు.
ఆమె భర్త, ఫిల్మ్ ప్రొడ్యూసర్ టైలర్ జకారియా గురించి పొగుడుతూ.. ఎంత ఒత్తిడి ఉన్నా సాయంత్రాలు పిల్లలతో గడపక పోవడం ఇబ్బందికరమే అంటూ.. తన భర్త గురించి చెప్పే క్రమలో తప్పుగా మాట్లాడారు. నా అధ్యక్షుడు.. క్షమించండి నా భర్త.. ఇక్కడే ఉన్నారు అంటూ భర్త గురించి చెప్పే క్రమంలో ట్రంప్ పేరు రావడం పొరపాటుకు కారణమైంది.
జకారియా ఆ పొరపాటును కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ, వావ్, అది చాలా బాగుంది, అని బదులిచ్చింది. కానీ కాస్త కంగారుపడినట్లు కనిపించింది. ఆ తర్వాత ఆమె బ్రీఫింగ్ రూమ్ నుండి హడావిడిగా వెళ్ళిపోయింది, దీంతో ఆమె మొదటి పత్రికా సమావేశం 15 నిమిషాల లోపే ముగిసింది.
దీనిపై డైలీ మెయిల్ స్పందించింది. ఆమె స్పీచ్ రొబోటిక్ మాదిరిగా ఉందని పేర్కొంది. ఎంత చెత్తగా ఉండాలో అంత చెత్తగా ఉంది ఆమె స్పీచ్ అంటూ పేర్కొంది.
ట్రంప్ రెస్పాన్స్:
సెక్రటరీ జకారియా చేసిన కామెంట్స్ వైరల్ అవ్వటంతో ప్రసిడెంట్ ట్రంప్ స్పందించారు. అలస్కాకు చారిత్రాత్కక పర్యటనకు బయల్దేరే ముందు ట్రంప్ వెనుక జకారియా నిలబడి ఉండగా.. ఆమె ఫస్ట్ ప్రెస్ బ్రీఫింగ్ గురించి వివరించారు. ఆమె చాలా బాగామాట్లాడింది.. ఆమె పర్ఫార్మెన్స్ బాగుంది.. చాలా చక్కగా ఉంది ఆమె ఫస్ట్ ప్రెస్ స్పీచ్ అంటూ కితాబిచ్చారు.
