గవర్నర్ కోటాలో  వడ్డెరలకు ఎమ్మెల్సీ ఇవ్వాలి

గవర్నర్ కోటాలో  వడ్డెరలకు ఎమ్మెల్సీ ఇవ్వాలి

బషీర్‌బాగ్, వెలుగు : రాబోయే గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ నియామకాల్లో వడ్డెర సామాజిక వర్గానికి  అవకాశం కల్పించాలని ఆ సంఘం నాయకులు డిమాండ్​ చేశారు.  బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో జాతీయ వడ్డెర సంఘం అధ్యక్షుడు పిట్ల శ్రీధర్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో వడ్డెరల జనాభా 25 లక్షలకు పైగా ఉన్నప్పటికీ విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో తగిన గుర్తింపు లభించడం లేదన్నారు.  జాతీయ వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శివకుమార్‌, జాతీయ ఉపాధ్యక్షుడు పిట్ల గోపాల్‌, గౌరవాధ్యక్షుడు రూపని లోకనాథం పాల్గొన్నారు.