న్యాయవ్యవస్థ పై కాంగ్రెస్ కుట్రలు :  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌‌‌‌.రాంచందర్‌‌‌‌రావు 

న్యాయవ్యవస్థ పై కాంగ్రెస్ కుట్రలు :  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌‌‌‌.రాంచందర్‌‌‌‌రావు 
  • 13 కోట్ల ఓట్ల డిలీట్ అయినట్లు ఆధారాలు చూపాలని  సవాల్ 
  • హైకోర్టు బార్ కౌన్సిల్ గేట్ వద్ద న్యాయవాదుల నిరసన  

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ వ్యవస్థలను బెదిరించే స్థాయికి దిగజారిపోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు అన్నారు. భారత న్యాయవ్యవస్థపై ప్రజలకున్న అపారమైన విశ్వాసాన్ని ఉద్దేశపూర్వకంగా దెబ్బతీసేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. సుప్రీంకోర్టుపై కాంగ్రెస్ నాటకీయ వైఖరిని ఖండిస్తూ మంగళవారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌లోని తెలంగాణ హైకోర్టు బార్ కౌన్సిల్ గేట్ వద్ద న్యాయవాదులు నిరసన చేపట్టారు.

ఈ సందర్భంగా రాంచందర్ రావు మాట్లాడుతూ సుప్రీంకోర్టు, కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్రపతి వ్యవస్థల పట్ల రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ గౌరవం ఉండాలని హితవు పలికారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల అపాయింట్‌‌‌‌మెంట్ అడిగి, అక్కడ రాజకీయ మెమోరాండాలు సమర్పిస్తామనడం ఎంతవరకు సమంజసమని రాహుల్ గాంధీని ప్రశ్నించారు.

కాంగ్రెస్‌‌‌‌లో సీనియర్ న్యాయవాదులు ఉన్నప్పటికీ.. న్యాయస్థానాల్లో పిటిషన్లు ఎలా దాఖలు చేయాలో  తెలీయకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. కోర్టుల వద్ద ర్యాలీలు, ధర్నాలు చేస్తూ రాజ్యాంగ వ్యవస్థలను అప్రతిష్టపాలు చేసే సంస్కృతిని ప్రజలు ఎన్నటికీ క్షమించబోరని హెచ్చరించారు.

సీజేఐపై విషప్రచారం

సీజేఐ జస్టిస్ సూర్యకాంత్‌‌‌‌ను టార్గెట్ చేస్తూ కేరళ కాంగ్రెస్ అధికారికంగా పోస్టులు పెట్టడం, ఆయన రాజీనామాను డిమాండ్ చేయడం న్యాయవ్యవస్థపై సాగిస్తున్న ప్రత్యక్ష దాడేనని చెప్పారు. దేశంలో అశాంతిని, హింసను ప్రేరేపించి కేంద్రాన్ని అస్థిరపరచాలనే కుట్రతో కాంగ్రెస్ ప్రజలపైనే యుద్ధం ప్రకటిస్తోందన్నారు. ఎస్ఐఆర్ ద్వారా దేశంలో 13 కోట్ల ఓట్ల డిలీట్ పచ్చి అబద్ధమని.. ఆధారాలంటే చూపాలని మంత్రి పొన్నం ప్రభాకర్​కు సవాల్  విసిరారు.  

 

మరిన్ని వార్తలు