న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీలోని జంతర్ మంతర్ ను డీ నోటిఫై చేయడం సమంజసం కాదని తెలంగాణ ఎంపీల ఫోరం కన్వీనర్ డాక్టర్ మల్లు రవి అన్నారు. ఈ ధర్నా వేదికను పునరుద్ధరించే అంశంపైనా ఇండియా కూటమి పోరాటం చేయనుందని తెలిపారు. మంగళవారం ఢిల్లీలో రాహుల్ గాంధీతో సమావేశమైన సందర్భంగా.. జంతర్ మంతర్ పునరుద్ధరణపై ఆయన స్పష్టమైన సంకేతాలు ఇచ్చారని మీడియాకు వెల్లడించారు.
ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే అవకాశం లేకుండా జంతర్ మంతర్ను ఎత్తివేయడం బీజేపీ నియంతృత్వ పాలనకు అద్దం పడుతోందన్నారు. సర్ ప్రక్రియలో సీఈసీ జ్ఞానేశ్ చేసిన అరాచకం బయటపడ్డాక ప్రజలు సైతం ఆలోచనలో పడ్డారని తెలిపారు. జ్ఞానేశ్ గద్దె దిగే వరకూ పోరాటం ఆపేది లేదని పేర్కొన్నారు.
