భారతదేశంలో ఎఫ్ సిరీస్ ప్రారంభమై 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఒప్పో సరికొత్త ఎఫ్35 సిరీస్ స్మార్ట్ఫోన్లను హైదరాబాద్ మార్కెట్లోకి విడుదల చేసింది. ఇందులో 8,000 ఎంఏహెచ్ బ్యాటరీతో కూడిన ఎఫ్35 ప్రో 5జీ, ఎఫ్35 5జీ మోడళ్లు ఉన్నాయి. 50ఎంపీ అల్ట్రా-వైడ్ సెల్ఫీ కెమెరా, 50ఎంపీ ప్రధాన కెమెరా, 4కే వీడియో రికార్డింగ్, మీడియాటెక్ డైమెన్సిటీ 7360 మ్యాక్స్ ప్రాసెసర్, 144హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే ఉన్నాయి. ఎఫ్35 ప్రో 5జీ ప్రారంభ ధర రూ. 45,999 కాగా గరిష్ఠంగా రూ.54,999 వరకు ఉంది. ఎఫ్35 5జీ ప్రారంభ ధర రూ. 39 వేలు.
