ఏపీలో 28 జిల్లాల జడ్పీ చైర్మన్‌ రిజర్వేషన్లు ఖరారు.. ఏ జిల్లాకు ఏ కేటగిరీ అంటే?

ఏపీలో 28 జిల్లాల జడ్పీ చైర్మన్‌  రిజర్వేషన్లు ఖరారు.. ఏ జిల్లాకు ఏ కేటగిరీ అంటే?

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని 28 జిల్లాల జిల్లా పరిషత్ చైర్మన్ పదవులకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. దీంతో ఆయా జిల్లాల్లో రాజకీయ సమీకరణాలు మారనున్నాయి. జడ్పీ చైర్మన్ పదవులను బీసీ, ఎస్సీ, ఎస్టీ, జనరల్ కేటగిరీలతో పాటు మహిళలకు కేటాయించారు. రిజర్వేషన్ల ఖరారుతో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆశావహుల్లో ఆసక్తి నెలకొంది.

జిల్లాల వారీగా రిజర్వేషన్ల కేటాయింపులు అభ్యర్థుల ఎంపికలో కీలకంగా మారనున్నాయి. ముఖ్యంగా మహిళలకు కేటాయించిన స్థానాల్లో తమ పార్టీ తరఫున బలమైన అభ్యర్థులను బరిలోకి దించేందుకు రాజకీయ పార్టీలు కసరత్తు చేసే అవకాశం ఉంది. అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు కేటాయించిన స్థానాల్లోనూ సామాజిక సమీకరణాలకు అనుగుణంగా అభ్యర్థుల ఎంపికపై పార్టీలు దృష్టి సారించనున్నాయి.

  • విశాఖపట్నం: బీసీ
  • తిరుపతి: ఎస్సీ మహిళ
  • ఎన్టీఆర్‌: ఎస్సీ
  • కృష్ణా: అన్‌రిజర్వ్‌డ్‌ మహిళ
  • ప్రకాశం: ఎస్సీ
  • నెల్లూరు: జనరల్‌
  • గుంటూరు: ఎస్సీ మహిళ
  • కోనసీమ: ఎస్సీ మహిళ
  • పల్నాడు: అన్‌రిజర్వ్‌డ్‌ మహిళ
  • తూర్పుగోదావరి: అన్‌రిజర్వ్‌డ్‌ మహిళ
  • పోలవరం: ఎస్టీ మహిళ
  • అల్లూరి సీతారామరాజు: ఎస్టీ
  • అనకాపల్లి: బీసీ మహిళ
  • అనంతపురం: బీసీ
  • అన్నమయ్య: అన్‌రిజర్వ్‌డ్‌
  • బాపట్ల: అన్‌రిజర్వ్‌డ్‌ మహిళ
  • కాకినాడ: అన్‌రిజర్వ్‌డ్‌ మహిళ
  • కర్నూలు: బీసీ
  • మార్కాపురం: అన్‌రిజర్వ్‌డ్‌
  • నంద్యాల: అన్‌రిజర్వ్‌డ్‌
  • పార్వతీపురం మన్యం: ఎస్టీ
  • శ్రీసత్యసాయి: అన్‌రిజర్వ్‌డ్‌
  • శ్రీకాకుళం: బీసీ మహిళ
  • విజయనగరం: బీసీ మహిళ
  • పశ్చిమగోదావరి: అన్‌రిజర్వ్‌డ్‌
  • కడప: అన్‌రిజర్వ్‌డ్‌
  • చిత్తూరు: అన్‌రిజర్వ్‌డ్‌ మహిళ
  • ఏలూరు: అన్‌రిజర్వ్‌డ్‌ మహిళ

  •