కూరగాయలు కొంటుండగా గుండెపోటు.. సీపీఆర్ చేసినా దక్కని ప్రాణం

కూరగాయలు కొంటుండగా గుండెపోటు.. సీపీఆర్ చేసినా దక్కని ప్రాణం

సూర్యాపేట: సూర్యాపేట జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కూరగాయలు కొనుగోలు చేస్తుండగా ఓ వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందాడు. ఈ ఘటన కోదాడ నియోజకవర్గంలోని చిలుకూరు మండలం బెతవోలు గ్రామంలో జరిగింది. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

బెతవోలు గ్రామానికి చెందిన బెజవాడ శ్రీనివాస్ కూరగాయలు కొనుగోలు చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో అక్కడున్న గ్రామస్తులు వెంటనే స్పందించి ఆయనకు సీపీఆర్ చేశారు. అనంతరం చికిత్స నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

అయితే, అప్పటికే శ్రీనివాస్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కూరగాయలు కొనుగోలు చేస్తుండగా చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.