విజయవాడ: విజయవాడ పర్యటనలో ఉన్న తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ జోసెఫ్ కనక దుర్గమ్మను దర్శించుకున్నారు. బెజవాడ దుర్గమ్మను దర్శించుకునేందుకు వెళ్లిన తమిళనాడు సీఎం విజయ్కు ఆలయ అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు.
వేదపండితులు సీఎం విజయ్‌కు వేదాశీర్వచనం, అమ్మవారి ప్రసాదం, శేషవస్త్రం అందించారు. అమ్మవారి ఆలయ ధ్వజ స్తంభానికి సీఎం విజయ్ నమస్కరించారు. తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అంతరాలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
#WATCH | Vijayawada, Andhra Pradesh: Tamil Nadu Chief Minister Joseph Vijay visits the Sri Durga Kanaka Temple and offers prayers. (Source: Andhra Pradesh I&PR) https://t.co/XCh0LTypQO
— ANI (@ANI) October 13, 2026
విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో అక్టోబర్ 11 నుంచి 20వ తేదీ వరకు శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతాయి. తెల్లవారుజాము నుంచే అమ్మవారి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. భవానీ నామ స్మరణతో ఇంద్రకీలాద్రి మార్మోగుతోంది.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నామని అధికారులు ప్రకటించారు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం సామాన్య భక్తులకు కొంత ఇబ్బందికరంగానే ఉన్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
