బంగాళాఖాతంలో ఏర్పడ్డ ద్రోణి కారణంగా ఏపీలో రానున్న మూడురోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. ద్రోణి కారణంగా ఏపీలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది వాతావరణ శాఖ.
బుధవారం ( అక్టోబర్ 14 ) పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖ, కోనసీమ, ఏలూరు, పశ్చిమగోదావరి, కృష్ణా, నెల్లూరు, ప్రకాశం,చిత్తూరు, పోలవరం జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని... మిగతా జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడతాయని తెలిపింది వాతవరణ శాఖ.
ఎల్నినో ప్రభావంతో పెరిగిన ఎండ, ఉక్కపోతతో అల్లాడుతున్న జనాలకు ఈ మూడురోజులు వర్షాలు కాస్త రిలీఫ్ ఇవ్వనున్నాయనే చెప్పాలి.అయితే.. పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్న క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది వాతవరణ శాఖ. బహిరంగ ప్రదేశాల్లో పని చేసే రైతులు, కూలీలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది వాతావరణ శాఖ.
