ఎల్బీనగర్ నర్సింగ్ కాలేజీ ఫర్నిచర్ ధ్వంసం.. ఎన్ఎస్‌యూఐ కార్యకర్తల అరెస్ట్

ఎల్బీనగర్ నర్సింగ్ కాలేజీ ఫర్నిచర్ ధ్వంసం.. ఎన్ఎస్‌యూఐ కార్యకర్తల అరెస్ట్

నర్సింగ్ కళాశాలలో ఫర్నిచర్ ధ్వంసం చేసినందుకు  ఎన్ఎస్‌యూఐ కార్యకర్తల అరెస్ట్ చేశారు పోలీసులు.  ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మన్సూరాబాద్‌ కేర్ నర్సింగ్ కళాశాలలో ఘటన జరిగింది. ఫర్నిచర్ ధ్వంసం చేయడంతో.. యాజమాన్యం ఫిర్యాదు మేరకు నలుగురిని అరెస్టు చేశారు.

విద్యార్థులకు సరైన వసతులు లేవంటూ ఎన్ఎస్‌యూఐ కార్యకర్తలు నిరసన చేపట్టారు. మహిళా సిబ్బందిని దూషించి భయాందోళనలకు గురిచేశారంటూ యాజమాన్యం ఫిర్యాదు చేసింది. యువకులను పిలిపించి హెచ్చరించారు ఎల్బీనగర్ పోలీసులు.

మరుసటి రోజే కళాశాలకు వెళ్లి ఫర్నిచర్ ధ్వంసం చేసినట్లు ఆరోపణలున్నాయి. జైకృష్ణ, నందకిషోర్, ప్రభాకర్, సిద్ధార్థ అరెస్టయ్యారు. నలుగురు యువకులను 2026 అక్టోబర్15న రిమాండ్‌కు తరలించారు . మరో నలుగురు మైనర్లను అదుపులోకి తీసుకున్నారు.