ఘట్కేసర్ సీఐ బాలస్వామి సస్పెండ్

ఘట్కేసర్ సీఐ బాలస్వామి సస్పెండ్

మేడ్చల్ జిల్లా : మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఘట్కేసర్ పీఎస్ సీఐ బాలస్వామి సస్పెండయ్యారు. 2026 అక్టోబర్ 14 (బుధవారం)  సస్పెండ్ చేస్తూ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. 

కొండాపూర్ కు చెందిన ఓ వ్యక్తికి సంబంధించిన భూతగాధ విషయంలో కేసును తప్పుదోవ పట్టించినట్లు ఆరోపణలున్నాయి. అదేవిధంగా సెప్టెంబర్లో  ఓ యువతి ఆత్మహత్య విషయంలో కేసును తప్పుదారి పట్టించేందుకు, అక్రమాలకు పాల్పడ్డారని విచారణలో తేలింది. దీంతో సీఐ బాలస్వామిని సస్పెండ్ చేశారు కమిషనర్.

 ఘట్కేసర్ లో స్థానికంగా ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. అయితే సీఐ బాలస్వామిపై భూతగాదాలు, ఇతరత్రా వ్యవహారాలలో అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.  సస్పెన్షన్ విషయం   అధికారికంగా ధ్రువీకరించల్సి ఉంది.

రాత్రి పోలీస్ స్టేషన్ నుంచి తన సామాగ్రి తీసుకెళ్లినట్లు  సమాచారం. పోయిన దసరాకు సీఐ  సైదులు ఇలాంటి భూ వివాదాల విషయంలోనే సస్పెండ్ కావడం గమనార్హం.