అసిస్టెంట్‌‌‌‌ ప్రొఫెసర్‌‌‌‌ పోస్టులు భర్తీ చేయాలి.. పార్ట్‌‌‌‌టైం లెక్చరర్లకు న్యాయం చేయాలి

అసిస్టెంట్‌‌‌‌ ప్రొఫెసర్‌‌‌‌ పోస్టులు భర్తీ చేయాలి.. పార్ట్‌‌‌‌టైం లెక్చరర్లకు న్యాయం చేయాలి

బషీర్‌‌‌‌బాగ్, వెలుగు : 12 యూనివర్సిటీల్లో  ఖాళీగా ఉన్న 1,063 అసిస్టెంట్‌‌‌‌ ప్రొఫెసర్‌‌‌‌ పోస్టులను ఒకే విడతలో భర్తీ చేసి పార్ట్‌‌‌‌టైం లెక్చరర్లకు న్యాయం చేయాలని తెలంగాణ ఆల్‌‌‌‌ యూనివర్సిటీస్‌‌‌‌ పార్ట్‌‌‌‌టైం అధ్యాపకుల సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్‌‌‌‌ చేసింది. 

తాజాగా విడుదలైన జీవో నంబర్‌‌‌‌ 31లో బోధనానుభవానికి కేటాయించిన 10 మార్కులను పార్ట్‌‌‌‌టైం అధ్యాపకులకు పూర్తిగా వర్తింపజేయాలని కోరారు. బషీర్‌‌‌‌బాగ్‌‌‌‌ ప్రెస్‌‌‌‌క్లబ్‌‌‌‌లో మాట్లాడుతూ తక్కువ వేతనాలతో పని చేస్తూ  ఇబ్బందులు పడుతున్నామని,  తమ సమస్యలను ప్రభుత్వం మానవీయ కోణంలో పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.

 విద్యా కమిషన్‌‌‌‌తో పాటు విశ్వవిద్యాలయాల పాలక మండళ్లు తమకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుని ప్రతిపాదనలు పంపాయని, ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. సంఘం నాయకులు చంద్రయ్య,  యుగంధర్‌‌‌‌, ఎస్‌‌‌‌.వి. రత్నం, జానకిరెడ్డి 
పాల్గొన్నారు.