సందీప్ కిషన్ హీరోగా ‘శంబాల’ ఫేమ్ యుగంధర్ ముని దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా సోషియో ఫాంటసీ మూవీ ‘కరికాల’. ఈ చిత్రంలో కేథరిన్ థ్రెసా, సాక్షి మడోల్కర్ కీలక పాత్రల్లో నటిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించిన మేకర్స్... తాజాగా మరో హీరోయిన్ గాయత్రి భరద్వాజ్ ఇందులో నటిస్తున్నట్టు వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆమె పాత్రకు సంబంధించిన కొత్త పోస్టర్ను విడుదల చేశారు. యువరాణి గెటప్లో కనిపిస్తున్న గత చిత్రాలకు భిన్నంగా సరికొత్త లుక్లో ఆకట్టుకుంది. షైనింగ్ పిక్చర్స్ పతాకంపై మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
రెండు భాగాలుగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 2027 జూలై 2న ఫస్ట్ పార్ట్ , అదే ఏడాది అక్టోబర్ 28న రెండో భాగాన్ని విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు.
Welcoming #gayatribhardwaj into the enchanting world of #Karikaala Produced by #rajasekharannabhimoju & @Mahidhar2003 Directed by @ugandharmuni Releasing On: Chapter 1 — 02 July 2027 Chapter 2 — 28 October 2027 Telugu | Tamil | Hindi https://t.co/x0CGPMkpa1
— Shining Pictures (@ShiningPictures) October 13, 2026
