కార్పొరేట్ రంగంలో HR డిపార్ట్మెంట్ ఇచ్చే మాటలను గుడ్డిగా నమ్మితే ఎంత పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందో తాజా ఘటన నిరూపిస్తోంది. దేశీయ టాప్ ఐటీ దిగ్గజం విప్రో 4 నెలలు మాత్రమే ఉద్యోగం చేసి.. మానసిక ఒత్తిడి తట్టుకోలేక రాజీనామా చేసిన మాజీ మహిళా ఉద్యోగికి నోటీసులు పంపించటం ఇప్పుడు ఐటీ రంగంలో కలకలం రేపుతోంది. ఆ లీగల్ నోటీసులో సదరు టెక్కీని రూ.30వేల130 కట్టాలని కంపెనీ కోరటం అందరినీ షాక్ కి గురిచేస్తోంది.
హర్యానాలోని గురుగ్రామ్‌కు చెందిన తన్ను అనే యువతి అక్టోబర్ 2025లో విప్రోలో కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్‌గా చేరింది. కంపెనీతో ఆమెకు ఏడాది కాంట్రాక్ట్ ఉంది. అయితే అక్కడ పని ఒత్తిడి విపరీతంగా ఉండటంతో భరించలేక ఆమె ఫిబ్రవరి 2026లో రాజీనామా చేసింది. ఈ క్రమంలో నోటీస్ పీరియడ్ రూల్స్ ప్రకారం రూ.30 వేలు కంపెనీకి కట్టాలని.. లేదంటే ఎక్స్పీరియన్స్ లెటర్ రాదని తెలిపింది విప్రో. అయితే ఈ అంశంపై హెచ్ఆర్ అధికారిని సంప్రదించగా.. "మీకు ఎక్స్పీరియన్స్ లెటర్ అవసరం లేకపోతే ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన పనిలేదు" అని ఫోన్లో మౌఖికంగా చెప్పారు. హెచ్ఆర్ మాటలను గుడ్డిగా నమ్మిన ఆ యువతి సరేలే అని ఊరుకుంది.
Wipro ने नौकरी छोड़ने वाली एक लड़की को 30 हज़ार का लीगल नोटिस भेज दिया। लड़की ने अक्टूबर 2025 में Gurugram ऑफिस जॉइन किया था। कॉन्ट्रैक्ट 12 महीने का था पर stress की वजह से उसने 4 महीने में नौकरी छोड़ दी। रिजाइन करते ही कंपनी ने कहा 30 हज़ार दो वरना experience letter नहीं मिलेगा। HR ने फोन पर साफ कहा था कि लेटर नहीं चाहिए तो पैसे देने की ज़रूरत नहीं। उसके बाद FNF टीम का आखिरी ईमेल..1/2
— Rahul Kumar (@MukAn_X) October 13, 2026
కానీ అసలు షాక్ ఏప్రిల్ 2026లో తగిలింది. కంపెనీ విడుదల చేసిన ఫైనల్ సెటిల్మెంట్ ప్రకటనలో ఆమె రావాల్సిన జీతం, బోనస్‌లను సున్నా చేయడమే కాకుండా.. నోటీస్ పీరియడ్ రికవరీ పేరుతో రూ. 27 వేలకు పైగా కోత విధించారు. అంతటితో ఆగకుండా.. సెప్టెంబర్ 30న విప్రో లీగల్ టీమ్ తన్నుకు ఒక లీగల్ నోటీసు జారీ చేసింది. 10 రోజుల్లోగా రూ.30వేల130 తో పాటు దానిపై 12 శాతం వార్షిక వడ్డీని చెల్లించాలని, లేకపోతే సివిల్ అండ్ క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆ నోటీసులో బెదిరించారు.
►ALSO READ | 5 ఏళ్ల నుంచి మా శాటిలైట్లు స్పేస్‌లో రెడీగా తిరుగుతున్నాయ్: మస్క్‌కు సునీల్ మిట్టల్ కౌంటర్
ఫోన్లో హెచ్ఆర్ ఇచ్చిన తప్పుడు హామీలతో ఉద్యోగినిని మోసం చేసి, ఇప్పుడు రివర్స్‌లో క్రిమినల్ కేసుల పేరుతో వేధించడంపై సోషల్ మీడియాలో విప్రో తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఐటీ కంపెనీలు ఉద్యోగుల మానసిక ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా, ఇలా అగ్రిమెంట్ల పేరుతో వేధింపులకు పాల్పడటంపై కార్పొరేట్ లోకంలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. విప్రో లాంటి బడా కంపెనీ కూడా ఇలా రూ.30వేల కోసం ఒక మహిళా ఉద్యోగిని బెదిరించే ప్రయత్నించటం, తమ హెచ్ఆర్ టీం తప్పుడు సమాచారం ఇచ్చినా గమనించకపోవటంపై అందరూ షాక్ అవుతున్నారు.
