'ఉప్పెన' మూవీతో తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న బేబమ్మ కృతిశెట్టి.. ఇప్పుడు బాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమైంది. అందమైన ప్రేమకథతో హిందీ చిత్ర పరిశ్రమలో హీరోయిన్గా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ను అధికారికంగా ప్రారంభించడానికి ముందు చిత్ర బృందం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారి ఆశీస్సులు తీసుకుంది.
ఏవిఎస్ స్టూడియోస్ (AVS Studios) పతాకంపై ప్రముఖ నిర్మాత అభిషేక్ ఎస్. వ్యాస్ నిర్మాణంలో రూపొందనున్న ఒక ప్యూర్ లవ్ స్టోరీతో కృతి శెట్టి హిందీ చిత్రసీమలోకి అడుగుపెడుతోంది. ఈ సినిమాకు 'హమ్ తేరే ప్యార్ మే' అనే ఆసక్తికరమైన టైటిల్ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఈ ప్రాజెక్టుకు రోహిత్ శెట్టి మద్దతు కూడా ఉండటంతో సినిమాపై ఆసక్తి పెరుగుతోంది
రోహిత్ శెట్టి వద్ద దాదాపు 17 ఏళ్లపాటు అసిస్టెంట్ డైరెక్టర్, కాస్టింగ్ డైరెక్టర్, డైలాగ్ రైటర్గా పనిచేసి విధి ఘోడ్గాంవకర్ (Vidhi Ghodgaonkar) ఈ లవ్ స్టోరీతో దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. అయితే ఇందులో కృతికి జోడీగా నటించే హీరో ఎవరనేది చిత్రబృందం ఇంకా సస్పెన్స్గానే ఉంచడంతో అభిమానుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.
ఇటీవలి కాలంలో సరైన సక్సెస్ లేక కాస్త వెనుకబడ్డ కృతి శెట్టికి ఈ బాలీవుడ్ ఎంట్రీ అత్యంత కీలకంగా మారింది. మారింది. మరోవైపు అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగా ప్రాజెక్ట్ 'జనవరి 12 విడుదల' తో పాటు, జయం రవితో కలసి నటించిన 'జీనీ' (Genie) సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మరి హిందీ లవ్ స్టోరీతో మన బేబమ్మ బాలీవుడ్లో ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.
