పంజాబ్‌లో డ్రగ్స్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న కార్యకర్త పర్విందర్ సింగ్ ఝోటా హత్య కేసు తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అశ్వనీ కుమార్‌కు చెందిన ఇంటిని రాజస్థాన్‌లో అధికారులు బుల్డోజర్తో కూల్చివేయగా, పంజాబ్‌లోని మాన్సాలో ఆయనకు చెందిన మెడికల్ షాప్‌కు నిరసనకారులు నిప్పు పెట్టారు.
బుధవారం పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్న నిరసనకారులు మెడికల్ షాప్‌లోకి వెళ్లి మందులను బయటకు విసిరేశారు. తరువాత షాపుకి నిప్పు పెట్టారు. ఈ సమయంలో భారీగా పోలీసులు మోహరించిన.. నిరసనకారులు ఆందోళన కొనసాగించారు.
మందులను బయటకు విసిరేసి
మాన్సాలోని రైల్వే ట్రాక్‌ల సమీపంలో ఉన్న అశ్వనీ కుమార్ మెడికల్ షాప్ వద్దకు నిరసనకారులు చేరుకొని.. షాప్‌లోకి వెళ్లి మందులను బయటకు తీసి విసిరేశారు. ఈ సందర్భంగా ‘బోలే సో నిహాల్’ అంటూ నినాదాలు చేస్తూ.. ఆ తర్వాత షాపుకి నిప్పు పెట్టారు.
నిరసనకారుల్లో ఒకరు ప్రెగాబాలిన్ క్యాప్సూల్స్ ప్యాకెట్లను చూపిస్తూ, పంజాబ్‌లో ఈ మందుపై నిషేధం ఉందని ఆరోపించారు. డ్రగ్స్ విక్రయాలను అడ్డుకునేందుకు పర్విందర్ సింగ్ ఝోటా పోరాడుతున్నారని, మెడికల్ షాప్ యజమానితో ఆయనకు వ్యక్తిగత గొడవ ఏమీ లేదని నిరసనకారులు పేర్కొన్నారు.
ఇంటిని, మెడికల్ షాప్‌ను కూల్చివేసిన అధికారులు
అశ్వనీ కుమార్‌కు చెందిన ఆస్తులపై జిల్లా యంత్రాంగం, పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. మాన్సాలోని గురుద్వారా రోడ్డులో ఉన్న ఆయన ఇంటి వద్దకు, రైల్వే ట్రాక్ సమీపంలోని మెడికల్ షాప్ వద్దకు జేసీబీతో చేరుకొని... మొదట మెడికల్ షాప్‌లోని కొంత భాగాన్ని అధికారులు కూల్చివేశారు. ఆ తర్వాత నిరసనకారులు అక్కడికి చేరుకుని మిగిలిన నిర్మాణాన్ని ధ్వంసం చేశారు. చివరకు దుకాణానికి నిప్పు పెట్టారు.
►ALSO READ | 8 నెలలు కష్టపడి నది క్లీన్ చేస్తే.. చెత్త వెధవలు ఇప్పుడు ఎలా చేశారో చూడండీ..
ఈ ఘటనపై నిరసనకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రగ్స్ వ్యాపారానికి పాల్పడుతున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదని వారు విమర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న డ్రగ్స్ వ్యతిరేక ప్రచారంపైనా నిరసనకారులు వ్యంగ్యంగా స్పందించారు. ఇది డ్రగ్స్‌పై యుద్ధం కాదని, డ్రగ్స్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్న వారిపై యుద్ధం అంటూ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. పర్విందర్ సింగ్ ఝోటా హత్య కేసు నేపథ్యంలో చోటుచేసుకున్న ఈ పరిణామాలు పంజాబ్‌లో తీవ్ర చర్చకు దారితీశాయి.
