IND vs WI: భారత్ వర్సెస్ వెస్టిండీస్ జట్ల మధ్య హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం (ఉప్పల్) వేదికగా జరిగే నాలుగో టీ20 మ్యాచ్‌కు ముందు విండీస్ బౌలింగ్ కోచ్ రవి రాంపాల్ (Ravi Rampaul) ఓ ఇంటర్వ్యూలో ఇండియన్ పిచ్‌లు, బౌలర్ల వ్యూహాలు, టీమిండియా బ్యాటింగ్ శైలిపై పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. భారత పిచ్‌లపై బౌలింగ్ చేయడం, అర్ష్‌దీప్ సింగ్ నైపుణ్యాలు, వెస్టిండీస్ కంటే తక్కువ సిక్సర్లు బాదినప్పటికీ టీమిండియా ఎలా భారీ స్కోర్లు సాధిస్తోందో ఆయన విశ్లేషించారు.
భారత పిచ్‌లపై యార్కర్లే ఏకైక మార్గం:
భారతదేశంలోని పిచ్‌లు పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలంగా (Flat Pitches) ఉన్నాయని రాంపాల్ వ్యాఖ్యానించారు. గతంలో మేం ఇండియాకు వచ్చినప్పుడు కూడా ఇక్కడ బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్లే ఉండేవి.. బలమైన భారత బ్యాటింగ్ లైనప్‌పై బౌలింగ్ చేస్తున్నప్పుడు బౌలర్లకు తప్పులు చేసేందుకు మార్జిన్ చాలా తక్కువగా ఉంటుంది. వైట్ బాల్ (White Ball) పెద్దగా స్వింగ్ కానప్పుడు పవర్‌ప్లేలో పెద్దగా చేసేదేమీ ఉండదు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్నప్పుడు ఫాస్ట్ బౌలర్లు పిచ్‌తో సంబంధం లేకుండా కేవలం యార్కర్లు (Yorkers) వేయడమే ఏకైక మార్గం.. అందుకే ఇండోర్ టీ20లో ఇరు జట్లు ఎక్కువ శాతం యార్కర్లను ప్రయోగించాయి.
షమర్ జోసెఫ్, రోస్టన్ చేజ్ బౌలింగ్ వ్యూహాలు:
* షమర్ జోసెఫ్ (Shamar Joseph): జోసెఫ్ మాకు డెత్ బౌలర్‌గా యార్కర్లు వేసేవాడు.. కానీ బ్యాటింగ్ పిచ్‌లపై అతని దగ్గర ఉన్న ఎక్స్ట్రా పేస్, అగ్రెషన్‌ను పవర్‌ప్లేలోనే ఉపయోగించి వికెట్లు తీయాలని అతని రోల్ మార్చాం.. వైట్-బాల్ క్రికెట్లో అనుభవం పెరిగే కొద్దీ అతను గొప్ప బౌలర్‌గా మారతాడు.
* రోస్టన్ చేజ్ (Roston Chase): చేజ్ ఎంతో స్థిరత్వంతో బౌలింగ్ చేస్తాడు.. ఈ పిచ్‌లపై స్పిన్ కాకపోవడంతో అతను కూడా తన వ్యూహాలను మార్చి యార్కర్లు వేయడం ప్రారంభిస్తున్నాడు.
భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ మోస్ట్ ఇంప్రెసివ్:
భారత జట్టులోని బౌలర్లలో యంగ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ తానెంతో ఇంప్రెస్ చేసినట్లు రాంపాల్ తెలిపారు. అర్ష్‌దీప్ ఫాస్ట్ బౌలర్‌గా అద్భుతంగా రాణిస్తున్నాడు. కొత్త బంతితో అన్ని రకాల వైవిధ్యాలను (Variations) ఉపయోగిస్తాడు. అతడు వేసే స్లోయర్ బాల్స్ ఎంతో ప్రభావవంతంగా ఉంటాయి. అంతేకాకుండా పవర్‌ప్లేలోనే యార్కర్లు వేయడానికి అతను ఏమాత్రం భయపడడు.
ALSO READ : గౌతమ్ గంభీర్ ఆస్తుల విలువ ఎంత? కుటుంబం, ఆదాయ వివరాలు ఇవే!
తక్కువ సిక్సర్లు బాదినా భారత్ భారీ స్కోర్లు:
విండీస్ బ్యాటర్లలా భారీ సిక్సర్లు కొట్టకపోయినా భారత్ ఎలా బిగ్ స్కోర్లు సాధిస్తోందో రవి రాంపాల్ వివరించారు. ఇండియన్ బ్యాటర్లు వెస్టిండీస్ లాగా కేవలం భారీ సిక్సర్ల మీద ఆధారపడే ప్లేయర్లు కారు. కానీ వారు బౌండరీలు కొడుతూనే నిరంతరం స్ట్రైక్ రొటేట్ (Strike Rotation) చేయడానికి మార్గాలు వెతుక్కుంటారు. అంతేకాకుండా వారు మైదానంలో కేవలం ఒక వైపే కాకుండా 360 డిగ్రీల చుట్టూ అన్ని వైపులా రన్స్ సాధిస్తారు. అందుకే ఎక్కువ సిక్సర్లు కొట్టకపోయినా భారీ స్కోర్లు సాధించగలుగుతున్నారు.
