గౌతమ్ గంభీర్ ఆస్తుల విలువ ఎంత? కుటుంబం, ఆదాయ వివరాలు ఇవే!

గౌతమ్ గంభీర్ ఆస్తుల విలువ ఎంత? కుటుంబం, ఆదాయ వివరాలు ఇవే!

Gautam Gambhir: గౌతమ్ గంభీర్ కేవలం అద్భుతమైన క్రికెటర్‌గానే కాకుండా, విజయవంతమైన కెప్టెన్, మెంటార్, రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త, ప్రస్తుతం భారత జాతీయ క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా అత్యంత ప్రభావవంతమైన వ్యక్తిగా ఉన్నతస్థాయికి ఎదిగారు. కాగా ఆయన ఆర్థిక స్థితిగతులు, సంపదకు సంబంధించి కొన్ని ముఖ్యమైన వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.. 

నికర విలువ (Net Worth):

గౌతమ్ గంభీర్ నికర విలువ సుమారు $32 మిలియన్లు (భారత కరెన్సీలో దాదాపు ₹200 - ₹265 కోట్ల వరకు అంచనా). క్రికెట్ మైదానంలో తన ఆటతో పాటు ఆ తర్వాత కోచింగ్, రాజకీయాలు, కామెంటరీ, బిజినెస్ వెంచర్లు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల ద్వారా అతడి ఈ స్థాయి సంపదను సమకూర్చుకున్నారు.

ప్రధాన ఆదాయ వనరులు:

టీమిండియా హెడ్ కోచ్ జీతం: భారత పురుషుల క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా గంభీర్ వార్షిక వేతనం సుమారు ₹12 కోట్ల వరకు ఉంటుందని అంచనా. దీంతో పాటు ప్రయాణ ఛార్జీలు, ఇతర అలవెన్సులు ఉంటాయి.

ఐపీఎల్ సంపాదన (IPL Earnings):

* ఆటగాడిగా ఉన్న సమయంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్లకు ఆడిన గంభీర్.. ఐపీఎల్ ద్వారా సుమారు ₹95 నుంచి ₹100 కోట్ల వరకు జీతం రూపంలో సంపాదించారు. కేకేఆర్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి 2012, 2014 సంవత్సరాల్లో టైటిల్స్ అందించారు.

* ఆ తర్వాత 2024 ఐపీఎల్ సీజన్‌లో KKR జట్టుకు మెంటార్‌గా వ్యవహరించి ఆ జట్టు మూడోసారి ఛాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించారు. ఈ పాత్రకు కూడా భారీ రిమ్యూనరేషన్ అందుకున్నారు.   

* రాజకీయ జీవితం: 2019 నుంచి 2024 వరకు తూర్పు ఢిల్లీ లోక్‌సభ స్థానం నుంచి పార్లమెంటు సభ్యుడిగా (MP) సేవలందించారు. ఆ సమయంలో ఆయన ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ఆయన పేరిట కోట్లాది రూపాయల చరాస్తి, స్థిరాస్తులు ఉన్నట్లు వెల్లడయ్యింది.

* వ్యాపారాలు: గంభీర్‌కు రియల్ ఎస్టేట్ రంగంలో భారీగా పెట్టుబడులు ఉన్నాయి. ఢిల్లీ (రాజేంద్ర నగర్), నోయిడా ప్రాంతాల్లో విలువైన ఆస్తులు ఉండగా, పలు స్టార్టప్‌లు, చిన్న వ్యాపారాలు, రెస్టారెంట్ రంగంలోనూ ఆయన పెట్టుబడులు పెట్టారు.

* బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు: తన కెరీర్ అంతటా, రిటైర్మెంట్ తర్వాత కూడా MRF, రెడ్‌క్లిఫ్ లాబ్స్, పిన్నకిల్ స్పెషాలిటీ వెహికల్స్ (PSV) లాంటి పలు ప్రముఖ బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. 

* దేశం గర్వించదగ్గ గొప్ప మ్యాచ్ విన్నర్‌గా నిలవడమే కాకుండా, తన వ్యాపార నైపుణ్యాలు, కోచింగ్ బాధ్యతలతో గంభీర్ భారతదేశపు అత్యుత్తమ సంపన్నులైన క్రికెటర్లలో ఒకరిగా కొనసాగుతున్నారు.