బొద్దింకలతో పొత్తుకు ఈగ పార్టీ రాయబారం

బొద్దింకలతో పొత్తుకు ఈగ పార్టీ రాయబారం

బొద్దింకల పార్టీ.. అదేనండీ కాక్రోచ్ జనతాపార్టీ (సీజేపీ) ఎలా పుట్టుకొచ్చిందో ఐడియా ఉండే ఉంటుంది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ చేసిన కామెంట్స్ తో వచ్చిన  సీజేపీ దేశ రాజకీయాలను ఎలా మలుపు తిప్పుతోందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మళ్లీ అలాగే.. సీజేఐ కామెంట్స్ తోనే మరో కొత్త పార్టీ పుట్టుకొచ్చింది. అదే మఖ్కీ జనతా పార్టీ (ఎంజేపీ). మనభాషలో  ఈగ పార్టీ అన్నమాట. 

స్థాపించిన 72 గంటల్లోనే 3 లక్షల 30 వేల ఫాలోవర్లు, 40 లక్షల వ్యూస్ వచ్చినట్లు పార్టీ ప్రకటించింది. ఆర్యన్ అనే స్టూడెంట్ ఈ పార్టీని స్థాపించాడు. దీనికి మంచి తెలివైన స్పోక్స్ పర్సన్స్ కావాలని పోస్ట్ చేసింది. 2021 జూన్లో పేజ్ క్రియేట్ చేయగా.. రీసెంట్ గా సీజేఐ చేసిన కామెంట్స్ తో మఖ్కీ జనతా పార్టీగా పేరు మార్చుకుంది. 

చీఫ్ జస్టిస్ కామెంట్స్ ఏంటి..:?

ఇటీవల అక్టోబర్ 10న సీజేపీ  తలపెట్టిన ఆందోళనల సందర్భంగా నిరసనకారులను అడ్డుకునేందుకు ఢిల్లీలో మెట్రో స్టేషన్లు మూసివేత, రైళ్ల రద్దు చేసింది ప్రభుత్వం.   విచారణ సందర్భంగా.. ఈగను కొట్టేందుకు సుత్తెను వాడటమేంటని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ చేసిన కామెంట్స్ ఆధారంగా పార్టీ స్థాపించినట్లు ప్రకటించారు.  

విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్  మాట్లాడుతూ.. నిరసనలను నియంత్రిచ్చవచ్చు కానీ.. అన్నింటినీ నిలిపివేయడం ఏంటి.. మీరు అన్నింటినీ ఆపలేరు. ఈగ  కోసం సుత్తిని వాడినట్లుందని అన్నారు. ఈగను చంపేందుకు సుత్తెను వాడొద్దు అన్నారు కదా.. ఇప్పుడు ఈగ చెప్పేది కూడా అదే.. ఈగ ఎవరికీ తక్కువేమీ కాదు అంటూ పోస్ట్ చేశారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by @makhijantaparty.ig

సీజేపీ లీడర్స్, నేహా బొరాకు సంఘీభావం:

కొత్తగా పుట్టిన ఎంజేపీ పార్టీ.. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ కు రాజీనామాక కోసం పోరాడుతున్న సీజేపీ లీడర్స్ కు, అదే విధంగా ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ మెంబర్ నేహా బొరాకు మద్ధతు ప్రకటించింది. నేహా బొరా ధైర్యం, ఆమె పట్టుదల ఇన్ స్పైరింగ్ అంటూ పేర్కొంది. 

ఎంజేపీ పార్టీ కాక్రోచ్ పార్టీ నేతలతో కాంటాక్ట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు పేర్కొంది. ఇరు పార్టీల మధ్య కోఆర్డినేషన్ కోసం.. అంగీకారం కుదుర్చుకునేందుకు ఈగ పార్టీ బొద్దింకల పార్టీతో రాయభారం నడిపుతోంది. 

అదే విధంగా జంతర్ మంతర్ దగ్గర సీజేపీ లీడర్లను అరెస్టు చేయడాన్ని ఎంజేపీ తప్పుపట్టింది. శాంతియుతంగా నిరసన చేయడం అందరి హక్కు.. జంతర్ మంతర్ తొలగించడం కరెక్ట్ కాదని పేర్కొంది. ప్రజాస్వామ్యానికి చర్చలు ముఖ్యం.. దూరం పెంచడం కాదంటూ శాంతియుత నిరసనలకు మద్ధతు ఇస్తున్నట్లు పేర్కొంది. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by @makhijantaparty.ig