చిన్న చిన్న విషయాలు కూడా మర్చిపోతున్నారా ? మతిమరుపు తగ్గాలంటే రోజూ ఈ 3 పనులు చేస్తే చాలు !

 చిన్న చిన్న విషయాలు కూడా మర్చిపోతున్నారా ? మతిమరుపు తగ్గాలంటే రోజూ ఈ 3 పనులు చేస్తే చాలు !

ఈ మధ్య చిన్న చిన్న విషయాలు కూడా మర్చిపోతున్నారా? ఏదైనా పని మీద వెళ్లి  వెళ్ళాక గుర్తుకు రావడం లేదా? మతిమరుపు సమస్య వయసుతో సంబంధం లేకుండా చాలామందిని ఇబ్బంది పెడుతోంది. అయితే కొన్ని చిన్న చిన్న అలవాట్లతో జ్ఞాపకశక్తిని మెరుగుపరచుకోవడానికి ప్రయత్నించవచ్చు. మరి మతిమరుపు తగ్గించుకోవడానికి ఎలాంటి టెక్నిక్స్ పాటించాలో తెలుసుకుందాం....

మైండ్ కి పదును
మతిమరుపుతో బాధపడేవాళ్లు చిన్నప్పటి విషయాలు లేదా ఇష్టమైన వారితో గడిపిన మెమరబుల్ మూమెంట్స్ ని గుర్తు చేసుకుంటుండాలి. లేదంటే టైం దొరికినప్పుడల్లా ఈజీగా హ్యాండిల్ చేసే పజిల్స్ సాల్వ్ చేయాలి. ఇలా చేయడం వల్ల మైండ్ షార్ప్ గా ఉంటుంది. దానివల్ల మెమరీ పవర్ ఆటోమెటిక్ గా  పెరుగుతుంది.

మల్టీ టాస్క్ లు వద్దు
ఒకేసారి రెండు పనులు చేయడానికి ప్రయత్నించకూడదు. దానివల్ల మైండ్ పై ఎక్కువ ప్రెషర్ పడుతుంది. అందువల్ల ఏ రోజు ఏ పని చేయాలో ముందుగానే నోట్ చేసుకోవాలి. అందులో ముఖ్యమైన వాటి నుంచి మొదలుపెట్టి పనులు వరుసగా చేసుకుంటూ వెళ్లాలి. దీనివల్ల మైండ్ ప్రశాంతంగా తన పని తాను చేసుకుంటుంది.

8 గంటలు నిద్ర  
కచ్చితంగా ప్రతిరోజూ 8 గంటలపాటు నిద్ర పోవాలి. దానివల్ల మైండ్ రిలాక్స్ అవుతుంది. త్వరగా పడుకుని, పొద్దున్నే లేవడమన్నది అలవాటుగా చేసుకోవాలి. దీనివల్ల ప్రతిరోజు మైండ్ యాక్టివ్ గా ఉంటుంది.