సూపర్‌స్టార్ రజినీకాంత్ నటించిన ‘జైలర్ 2’ (Jailer 2) ఇవాళ (అక్టోబర్ 15, 2026న) దసరా సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ‘జైలర్’తో బ్లాక్‌బస్టర్ అందుకున్న నెల్సన్ దిలీప్‌కుమార్ ఈ సీక్వెల్‌ను గ్రాండ్‌గా తెరకెక్కించారు. సూరజ్ వెంజరమూడు, ఎస్.జె. సూర్య, మిథున్ చక్రవర్తి, విద్యాబాలన్ తదితరులు కీలక పాత్రల్లో నటించగా.. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.
భారీ అంచనాలతో ఫ్యాన్స్‌కు ముందుకొచ్చిన ‘జైలర్ 2’ ఎలా ఉంది? రజినీకాంత్ తనదైన స్టైల్, స్వాగ్, మాస్ ఎలివేషన్స్‌తో మరోసారి ప్రేక్షకులను మెప్పించారా? నెల్సన్ మార్క్ కామెడీ, అనిరుధ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉన్నాయి? మొదటి భాగాన్ని మించి సీక్వెల్ ఆకట్టుకుందా? సినిమా చూసిన ఓవర్సీస్ ఆడియన్స్ సోషల్ మీడియాలో ఎలాంటి రివ్యూలు ఇస్తున్నారు? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
జైలర్ 2 కథ:
టైగర్ ముత్తువేల్ పాండియన్‌గా మరోసారి కనిపించారు రజినీకాంత్. ఫస్ట్ పార్ట్‌కు మెయిన్ విలన్ అయిన వర్మను చంపిన ముత్తువేల్ పాండియన్ కోసం శత్రువులు వెతుకుతుంటారు. అయితే తన గురించి ఎవరికీ తెలియకుండా ఓ సాధారణ డ్రైవర్‌గా అజ్ఞాతంలో ఉంటాడు జైలర్. తనను వెతుక్కుంటూ వచ్చిన విలన్ గ్యాంగ్‌ను ఆయన ఎలా ఎదుర్కొన్నాడు అనేది ఈ మూవీ మెయిన్ కాన్సెప్ట్‌గా చూపించారు.
కొత్త శత్రువుల ప్రవేశం..
ఈసారి సూరజ్ వెంజరమూడు, ఎస్.జె. సూర్య, విద్యాబాలన్ వంటి స్టార్ యాక్టర్స్ విలన్స్ గా నటించారు. వీరి పాత్రలు ముత్తువేల్ పాండియన్‌కు ఎలాంటి సవాళ్లు విసురుతాయి? నేర ప్రపంచంలో వీరి మధ్య ఉన్న సంబంధాలు ఏమిటి? అన్నది సినిమాలో ఆసక్తిని పెంచేలా డిజైన్ చేశాడు డైరెక్టర్ నెల్సన్. తన కుటుంబాన్ని, తనవాళ్లను కాపాడుకోవాల్సిన పరిస్థితులు ఎదురైనప్పుడు ముత్తువేల్ మరోసారి తన పాత పద్ధతుల్లో శత్రువులను ఎదుర్కొంటాడు. సాధారణ వ్యక్తిలా కనిపించే అతని వెనుక ఎంతటి భయంకరమైన గతం ఉందో మరోసారి బయటపడుతుంది. భారీ యాక్షన్ సన్నివేశాలు, రజినీకాంత్ స్టైల్, మాస్ ఎలివేషన్లు సినిమాకి ఇంపాక్ట్ తీసుకొచ్చాయి .
ఆడియన్స్ టాక్ ఇదే...
ఫస్ట్ హాఫ్‌కు సాలిడ్ రెస్సాన్స్ వస్తుంది. టైటిల్ కార్డ్, రజినీకాంత్ మాస్ ఎలివేషన్స్, స్టైలిష్ యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయని ఓవర్సీస్ రివ్యూలు చెబుతున్నాయి. నెల్సన్ దిలీప్‌కుమార్ మార్క్ కామెడీ, టీ స్టాల్ సీన్, ఇంటర్వెల్ బ్లాక్ బాగా వర్కవుట్ అయ్యాయని ఆడియన్స్ ట్వీట్స్ పెడుతున్నారు. రజినీకాంత్ ఎలివేషన్ సీన్స్ కు అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ స్ట్రాంగ్ ఇంపాక్ట్ ఇచ్చిందని అంటున్నారు. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ తలైవా ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తుందని సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు నెటిజన్లు.
జైలర్ 2 ఫస్ట్ హాఫ్: సాలిడ్ కమర్షియల్ ఎంటర్టైనర్
ఓ ఆడియన్ ‘జైలర్ 2’ ఫస్ట్ హాఫ్ సాలిడ్ కమర్షియల్ ఎంటర్టైనర్గా ఉందని రివ్యూయర్ అభిప్రాయపడ్డారు. ప్రారంభంలో కథనం కాస్త నెమ్మదిగా సాగినా, నెల్సన్ మార్క్ కామెడీ, రజినీకాంత్ మాస్ ఎలివేషన్స్, అనిరుధ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకున్నాయని తెలిపారు. మొదటి భాగం ఫార్ములాను అనుసరిస్తూనే సినిమా వినోదాత్మకంగా సాగుతోందని, ఇంటర్వెల్ బ్లాక్ అదిరిపోయిందని అన్నారు.
#Jailer2 Solid Commercial 1st Half! Follows a familiar template and starts a bit slow, but once the setup is established, Nelson’s trademark comedy works well along with a few solid Superstar elevation scenes backed by Anirudh’s BGM. Continues right where Part 1 ends and stays entertaining so far.
— Venky Reviews (@venkyreviews) October 15, 2026
కామెడీ అదుర్స్.. ఇంటర్వెల్ బ్లాక్ మాస్ జాతర!
‘జైలర్ 2’ ఫస్ట్ హాఫ్ అద్భుతంగా ఉందని రివ్యూయర్ పేర్కొన్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ మళ్లీ మళ్లీ చూసేలా కామెడీ సీన్స్ ఉన్నాయని, మూర్తి బ్రిడ్జ్, కాఫీ షాప్ సన్నివేశాలు అదిరిపోయాయని తెలిపారు. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్, అనిరుధ్ రవిచందర్ మాస్ బీజీఎం నెక్స్ట్ లెవల్లో ఉన్నాయని ప్రశంసించారు.
Done with first half: Extraordinary comedy(Family repeats) Murthy bridge scene🔥🔥 Coffee shop scene🔥🔥 Interval 🙏😭🔥 Anirudh kola mass🔥🔥 Negatives: Alabolelo song placement . Thalaivar foot on 70MM is CINEMA #Jailer2 https://t.co/CiZ3av8LhS
— Legend Prabhas 🇮🇳 (@CanadaPrabhasFN) October 15, 2026
అయితే ‘అలబోలెలో’ పాట ప్లేస్మెంట్ మైనస్‌గా పేర్కొన్నారు. 70ఎంఎం స్క్రీన్‌పై తలైవార్ రజినీకాంత్‌ను చూడటమే అసలైన సినిమా అనుభూతి అని అభిప్రాయపడ్డారు.
