ఏపీ లోకల్ బాడీ ఎన్నికల షెడ్యూల్ విడుదల..అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్

ఏపీ లోకల్ బాడీ ఎన్నికల షెడ్యూల్ విడుదల..అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్

హైదరాబాద్, వెలుగు: ఆంధ్రప్రదేశ్‌‌‌‌లో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) అనిల్ చంద్ర పునేఠా బుధవారం ఎన్నికల షెడ్యూల్‌‌‌‌ను విడుదల చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.  13 మున్సిపల్‌‌‌‌ కార్పొరేషన్లు, 77 మున్సిపాలిటీలు, 10 నగర పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. 

తొలుత పట్టణ స్థానిక సంస్థలకు (యూఎల్‌‌‌‌బీ) ఎన్నికలు జరగనుండగా.. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు ఈ నెల 28న పోలింగ్ నిర్వహించి, 30న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. అలాగే, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు ఈ నెల19న నోటిఫికేషన్ రిలీజ్ చేసి, నవంబర్ 3న పోలింగ్, నవంబర్ 5న ఫలితాలు వెలువడనున్నాయి. ఇక అత్యంత కీలకమైన గ్రామ పంచాయతీ ఎన్నికలను మూడు విడతల్లో నిర్వహించనున్నారు. నవంబర్ 26న మొదటి విడత, నవంబర్ 29న రెండో విడత, డిసెంబర్ 2న మూడో విడత పోలింగ్ జరగనుండగా, పోలింగ్ జరిగిన రోజే ఓట్ల లెక్కింపు చేపడతామని ఎస్‌‌‌‌ఈసీ స్పష్టం చేశారు. ఈ ఎన్నికల ప్రకటనతో రాష్ట్రంలో రాజకీయం వేడెక్కగా, రాజకీయ పార్టీలు, ఆశావహులు అప్రమత్తమై ఎన్నికల సన్నద్ధతపై దృష్టి సారించారు.