గోవా డ్రగ్ పెడ్లర్‌‌‌‌‌‌‌‌ లిస్టులో ఏపీ, తెలంగాణకు చెందిన వెయ్యి మంది కస్టమర్లు !

గోవా డ్రగ్ పెడ్లర్‌‌‌‌‌‌‌‌ లిస్టులో ఏపీ, తెలంగాణకు చెందిన వెయ్యి మంది కస్టమర్లు !
  • గోవాలో ఈగల్‌‌‌‌ ఫోర్స్‌‌‌‌ భారీ ఆపరేషన్‌‌‌‌, ఇద్దరు డ్రగ్స్‌‌‌‌ పెడ్లర్లు అరెస్ట్‌‌‌‌
  • ఏపీ, తెలంగాణకు చెందిన 1,000 మంది కస్టమర్లను గుర్తించిన ఈగల్‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌,వెలుగు: గోవా కేంద్రంగా తెలంగాణకు మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టయింది. గోవా డ్రగ్స్ పెడ్లర్‌‌‌‌‌‌‌‌ వద్ద రెగ్యులర్‌‌‌‌‌‌‌‌గా డ్రగ్స్‌‌‌‌ కొనుగోలు చేస్తున్న 1000 మంది వివరాలను రాష్ట్ర ఈగల్‌‌‌‌ ఫోర్స్ గుర్తించింది. వీరిలో 800 మంది హైదరాబాద్ సహా తెలంగాణ జిల్లాలకు చెందిన వారు కాగా మరో 200 మందికి పైగా ఏపీకి చెందిన కస్టమర్లు ఉన్నట్టు ఈగల్ దర్యాప్తులో వెలుగు చూసింది.

డ్రగ్స్ కస్టమర్ల కాంటాక్ట్‌‌‌‌ డేటా ఆధారంగా గోవాలోని ప్రధాన పెడ్లర్లు‌‌‌‌ ప్రీతీష్‌‌‌‌ నారాయణ్‌‌‌‌ బోర్కర్‌‌‌‌ అలియాస్‌‌‌‌ బాబు అలియాస్‌‌‌‌ ఖలీ (36), బషారత్‌‌‌‌ అహ్మద్‌‌‌‌ ధగ్గ(46)ను మంగళవారం అరెస్ట్‌‌‌‌ చేసింది. ఈ మేరకు ఈగల్ డైరెక్టర్ సందీప్ శాండిల్యా బుధవారం ప్రకటించారు.

కస్టమర్ల డేటా ఆధారంగా ఈగల్ ఆపరేషన్‌‌‌‌
హైదరాబాద్‌‌‌‌లో పట్టుబడిన డ్రగ్స్‌‌‌‌ సప్లయర్లు, కస్టమర్ల డేటా ఆధారంగా ఈగల్ ఫోర్స్‌‌‌‌ గోవాలో ఆపరేషన్ నిర్వహించింది. ఈ నెల 12న  గోవా పోలీసులతో కలిసి సోదాలు చేపట్టింది. గోవాలోని అంజునా ప్రాంతం కేంద్రంగా డ్రగ్స్‌‌‌‌ సరఫరా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రీతీశ్ నారాయణ్‌‌‌‌ బోర్కర్‌‌‌‌ అలియాస్‌‌‌‌ బాబు అలియాస్‌‌‌‌ ఖలీ (36)ను అరెస్ట్‌‌‌‌ చేసింది. నిందితుడికి తెలంగాణ,ఏపీలో 1000 మందికి పైగా కస్టమర్లు, సప్లయర్లతో ప్రత్యక్ష సంబంధాలున్నట్టు గుర్తించింది.

దర్యాప్తులో భాగంగా నార్త్‌‌‌‌ గోవాలో బషారత్‌‌‌‌ అహ్మద్‌‌‌‌ ధగ్గ అలియాస్‌‌‌‌ బిలాల్‌‌‌‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద 13 ఎల్‌‌‌‌ఎస్‌‌‌‌డీ బ్లాట్స్‌‌‌‌, 8 ఎక్స్‌‌‌‌టసీ మాత్రలు, సుమారు 100 గ్రాముల చరస్‌‌‌‌ను స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. వీటి విలువ రూ.1.5లక్షలకుపైగా ఉంటుందని అంచనా వేశారు.