ఉక్రెయిన్పై రష్యా భీకర క్షిపణి దాడి.. 9 మంది మృతి

ఉక్రెయిన్పై రష్యా భీకర క్షిపణి దాడి.. 9 మంది మృతి

కీవ్/మాస్కో: ఉక్రెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై రష్యా మిస్సైల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దాడులు చేసింది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందగా, 12 మంది గాయపడ్డారు. ఉక్రెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని కీలక విద్యుత్, ఇంధన కేంద్రాలు, కమ్యూనికేషన్ వ్యవస్థలే లక్ష్యంగా చేసిన ఈ దాడులతో 5 లక్షల మందికి పైగా ప్రజలు అంధకారంలో చిక్కుకున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల ఎనర్జీ సీజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫైర్ ప్రకటించిన కొద్దిరోజులకే రష్యా బలగాలు ఉక్రెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై దాడికి తెగబడటం గమనార్హం. 

కీవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని రెండు విద్యుత్ హీటింగ్ కేంద్రాలు, చుట్టుపక్కల ప్రాంతాల్లోని మరో రెండు ప్లాంట్లు, ఒక ప్రధాన విద్యుత్ సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై దాడి చేశామని రష్యా డిఫెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మినిస్ట్రీ తెలిపింది. అలాగే, ఖార్కివ్ సిటీలోని విద్యుత్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్నట్లు వెల్లడించింది. కీవ్ నగరంలో బాలిస్టిక్, హైపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సోనిక్ క్షిపణులతో దాడి చేశామని, దీంతో విద్యుత్ వ్యవస్థ కుప్పకూలిందని చెప్పింది. మరోవైపు, రష్యా భూభాగంపైన ఉక్రెయిన్ కూడా భారీ స్థాయిలో డ్రోన్లతో విరుచుకుపడింది. దాదాపు 900కు పైగా ఉక్రెయిన్ డ్రోన్లను కూల్చివేసినట్లు రష్యా డిఫెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వర్గాలు ప్రకటించాయి.