పీజీ మెడికల్ సీట్ల భర్తీకి కాళోజీ వర్సిటీ నోటిఫికేషన్..నేటి(అక్టోబర్ 15) నుంచి దరఖాస్తులు ప్రారంభం

పీజీ మెడికల్ సీట్ల భర్తీకి కాళోజీ వర్సిటీ నోటిఫికేషన్..నేటి(అక్టోబర్ 15) నుంచి దరఖాస్తులు ప్రారంభం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో 2026-–27 విద్యా సంవత్సరానికి సంబంధించి పీజీ డిగ్రీ, డిప్లొమా కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి కాళోజీ వర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇన్-సర్వీస్, నాన్-సర్వీస్ అభ్యర్థులు గురువారం సాయంత్రం 4 గంటల నుంచి ఈ నెల 23వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు tspgmed.tsche.in వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్ ద్వారా సర్టిఫికెట్లు అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోడ్ చేసి ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో దరఖాస్తు చేసుకోవాలని వర్సిటీ అధికారులు తెలిపారు. తెలంగాణలోని కాలేజీలు లేదా సిద్ధార్థ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసి, సెప్టెంబర్ 30 నాటికి ఇంటర్న్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్ ముగించుకున్న స్థానిక అభ్యర్థులు మాత్రమే ఈ సీట్లకు అర్హులు. 

నీట్ పీజీ-2026 కటాఫ్ మార్కుల ప్రకారం జనరల్/ఈడబ్ల్యూఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 262, పీడబ్ల్యూడీకి 244, ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 226 మార్కులుగా నిర్ణయించారు. ఇప్పటికే పీజీ లేదా డీఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీ అభ్యసిస్తున్న విద్యార్థులు దరఖాస్తు చేయడానికి అనర్హులు. రిజిస్ట్రేషన్ కోసం ఓసీ, బీసీలు రూ.10,000, ఎస్సీ, ఎస్టీలు రూ.8,000 చెల్లించాలి. సీట్ల కేటాయింపులో ఎస్సీ వర్గీకరణ, ఎస్టీ (10%), బీసీ (29%), మహిళా (33.3%), దివ్యాంగ (5%), ఇన్-సర్వీస్ కోటా నిబంధనలు అమలవుతాయి. సీటు పొందినవారు రూ.35,000 వర్సిటీ ఫీజు చెల్లించాలి. ఫ్రీ ఎగ్జిట్ గడువు ముగిశాక కోర్సు మధ్యలో మానేస్తే రూ.50 లక్షల పెనాల్టీతో పాటు స్టైఫండ్ వెనక్కి ఇవ్వాలని, మూడేళ్లపాటు కౌన్సెలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అనర్హులని హెచ్చరించారు. అలాగే కోర్సు పూర్తయ్యాక ఏడాది ప్రభుత్వ సర్వీస్ చేయాలని, డిప్లొమా అభ్యర్థులు రూ.10 లక్షలు, పీజీ డిగ్రీ అభ్యర్థులు రూ.20 లక్షల బాండ్ సమర్పించాలని స్పష్టం చేశారు.

యాదాద్రి మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా డాక్టర్ కె. రాజ్యలక్ష్మి 

యాదాద్రి భువనగిరి ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) డాక్టర్ కె.రాజ్యలక్ష్మి నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) పంపిన నివేదిక, ఆర్థిక శాఖ నిబంధనల మేరకు ఆమెను యాదాద్రి భువనగిరి మెడికల్ కాలేజీలో ఖాళీగా ఉన్న ప్రిన్సిపాల్ స్థానంలో నియమిస్తున్నట్లు వైద్యారోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ క్రిస్టినా జెడ్. చోంగ్తు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.