పోక్సో కేసుకు భయపడి ఉరేసుకున్న నిందితుడు..రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలంలో ఘటన

పోక్సో కేసుకు భయపడి ఉరేసుకున్న నిందితుడు..రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలంలో ఘటన

ఇబ్రహీంపట్నం, వెలుగు : పోక్సో కేసు నమోదు కావడంతో ఓ నిందితుడు భయంతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం అల్మాస్​గూడకు చెందిన రామిడి హర్షవర్ధన్ రెడ్డి (31)  కొద్ది రోజుల కింద ఓ బాలిక స్నానం చేస్తుండగా వీడియో తీశాడని ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. 

దీంతో ఈ నెల 12న మీర్​పేట్​పీఎస్​లో పోక్సో కేసు నమోదైంది. ఈ విషయం తెలియడంతో హర్షవర్ధన్​రెడ్డి కంగారు పడ్డాడు. ఎక్కడ తనను అరెస్ట్​ చేస్తారో అనే భయంతో బుధవారం   తుర్కయంజాల్ లోని రాఘవేంద్ర కాలనీలో సోదరి ఇంటికి వెళ్లాడు. 

అక్కడే ఓ గదిలో ఫ్యాన్​కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.  కేసు నమోదు చేసి  దర్యాప్తు చేస్తున్నామని ఆదిభట్ల ఎస్సై సైదయ్య తెలిపారు.