Dont Sleep Teaser: టాలీవుడ్‌లోకి మరో సైకలాజికల్ థ్రిల్లర్.. ఉత్కంఠగా ‘డోంట్ స్లీప్’ టీజర్

Dont Sleep Teaser: టాలీవుడ్‌లోకి మరో సైకలాజికల్ థ్రిల్లర్.. ఉత్కంఠగా ‘డోంట్ స్లీప్’ టీజర్

‘చౌర్య పాఠం’ ఫేమ్ ఇంద్ర రామ్ హీరోగా మలయాళ సినిమాటోగ్రాఫర్ షామ్‌‌‌‌‌‌‌‌దత్ దర్శకత్వంలో రూపొందుతున్న సైకలాజికల్ థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‘డోంట్ స్లీప్‌‌‌‌‌‌‌‌’. వి. చూడామణి నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌‌‌‌‌‌‌‌ను నాగచైతన్య, విజయ్ సేతుపతి, దుల్కర్ సల్మాన్ విడుదల చేశారు.

అనంతరం జరిగిన టీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లాంచ్‌‌‌‌‌‌‌‌ ఈవెంట్‌‌‌‌‌‌‌‌లో హీరో ఇంద్రరామ్ మాట్లాడుతూ ‘సినిమా చాలా క్వాలిటీగా వచ్చింది. షామ్‌‌‌‌‌‌‌‌దత్‌‌‌‌‌‌‌‌ గారితో నాది ఎమోషనల్ జర్నీ. దర్శకుడిగానే కాక అన్ని విభాగాల్లోనూ కేర్ తీసుకున్నారు.  కచ్చితంగా హిట్ కొడతామనే నమ్మకం ఉంది. దేవ కట్టా గారు కొన్ని డైలాగ్స్, ఓ సాంగ్ రాశారు’ అని చెప్పాడు.

డైరెక్టర్ షామ్ దత్ మాట్లాడుతూ ‘ఇది రెగ్యులర్ సినిమా కాదు. చాలా కొత్త కథ.  ఇంద్ర లాంటి ప్యాషనేట్ యాక్టర్ దొరకడం హ్యాపీ’ అని చెప్పారు. అందరికీ నచ్చే సినిమా అవుతుందని  హీరోయిన్ జోయీతా బెనర్జీ చెప్పింది. డైరెక్టర్ దేవ కట్టా మాట్లాడుతూ ‘షామ్‌‌‌‌‌‌‌‌ మంచి సినిమా లవర్. తను లేకుంటే నేను తీసిన ‘ప్రస్థానం’ అయ్యేది కాదు. అప్పట్లోనే డైరెక్షన్‌‌‌‌‌‌‌‌ చేయమని చెప్పా. కచ్చితంగా ఇది ఎక్సైటింగ్‌‌‌‌‌‌‌‌ సినిమా అవుతుంది.

ఇందులో ఓ కామియో రోల్ కూడా చేశా’ అని చెప్పారు. సినిమాటోగ్రాఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎనభై శాతం విజయాలు అందుకున్న షామ్ దత్.. దర్శకుడిగానూ మెప్పించాలని నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ విష్ చేశారు. నటుడు అనీష్ కురువిల్లా, దర్శకులు కళ్యాణ్ శంకర్,  శ్రీరామ్ ఆదిత్య, రాధాకృష్ణ 
బెస్ట్ విషెస్‌‌‌‌‌‌‌‌ చెప్పారు.