బీసీ ఓవర్సీస్ స్కాలర్ షిప్ గడువు పెంపు..అక్టోబర్ 30 వరకు గడువు

బీసీ ఓవర్సీస్ స్కాలర్ షిప్ గడువు పెంపు..అక్టోబర్ 30 వరకు గడువు

హైదరాబాద్, వెలుగు: మహాత్మ జ్యోతిబాఫూలే బీసీ ఓవర్సీస్ విద్యానిధి పథకం దరఖాస్తు గడువు ఈనెల 30 వరకు పెంచుతున్నట్లు కమిషనర్ బాలమాయదేవి వెల్లడించారు. గురువారంతో గడువు ముగియనుండగా మరో 15 రోజులు పొడిగిస్తున్నట్లు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. విదేశాలలో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే బీసీ, ఈబీసీ విద్యార్థుల కోసం ఈ స్కీమ్ ను అమలు చేస్తున్నారు. 

అభ్యర్థి కుటుంబ వార్షిక ఆదాయం రూ. 5 లక్షల కంటే తక్కువ ఉండాలని, దరఖాస్తు చేసుకునే సమయానికి 35 సంవత్సరాలు మించరాదని కమిషనర్ సూచించారు. డిగ్రీలో 60 శాతం కనీస మార్కులు ఉండాలని, జీఆర్ఈలో 260 మార్కులు లేదా జీమ్యాట్ లో 500 మార్కులు సాధించాలన్నారు. టోఫెల్ పరీక్షలో 60 మార్కులు లేదా ఐఈఎల్ టీఎస్ లో 6.0 బ్యాండ్, పీటీఈలో 50 మార్కులు పొంది ఉండాలన్నారు.