నాగార్జునసాగర్ ఎడమ కాలువకు గండి

నాగార్జునసాగర్ ఎడమ కాలువకు గండి
  •  నీటి విడుదల తగ్గించి మరమ్మతులకు ఆఫీసర్ల చర్యలు
  •  

హాలియా, వెలుగు: నల్గొండ జిల్లా నిడమనూరు మండల పరిధిలో నాగార్జునసాగర్ ప్రధాన ఎడమ కాలువ 31వ కిలోమీటర్ వద్ద నర్సింహులగూడెం మేజర్ తూముకు గండి పడింది. నిడమనూరు పట్టణ తాగునీటి అవసరాల కోసం తూము ద్వారా నీటిని విడుదల చేయడంతో గండిపడినట్టు ఆఫీసర్లు తెలిపారు. దీంతో సాగర్ నుంచి ఎడమ కాలువకు నీటి విడుదలను 6,100 క్యూసెక్కుల నుంచి 3,000 క్యూసెక్కులకు తగ్గించారు.

ఎస్‌‌‌‌ఈ బీవీ మల్లికార్జున్, ఈఈ గోపినాథ్ గండిపడిన ప్రాంతాన్ని పరిశీలించారు. నీటి ఉధృతి తగ్గిన తర్వాతే మరమ్మతులు చేపట్టడం సాధ్యమని ఆఫీసర్లు తెలిపారు. ప్రస్తుతం గండిపడిన ప్రాంతంలో జేసీబీతో మట్టిని చదును చేసే పనులు ప్రారంభించారు. నీటి ప్రవాహం తగ్గిన వెంటనే మరమ్మతులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.