విధి నిర్వహణలో మానవత్వం చాటుకున్నాడు ఓ కానిస్టేబుల్.నదిలో నుంచి కిలోమీటరుకు పైగా మృతదేహాన్ని భుజాలపై మోసి ఒడ్డుకు చేర్చాడు. కర్నూలు జిల్లా మంత్రాలయం సమీపంలో జరిగింది ఈ ఘటన. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. తుంగభద్ర నదిలో మహిళ మృతదేహాన్ని వెలికితీసిన కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న రంగస్వామి. మృతదేహాన్ని భుజాలపై మోస్తూ దాదాపు కిలోమీటరు దూరం నడిచాడు.
రాళ్లు, రప్పలు ఉన్న మార్గంలోనూ వెనకడుగు వేయకుండా మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చాడు కానిస్టేబుల్.మృతురాలిని కర్ణాటకకు చెందిన 41ఏళ్ళ జయశీలగా గుర్తించారు పోలీసులు. నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక సమాచారం.
అయితే.. కానిస్టేబుల్ రంగస్వామి మానవత్వానికి హ్యాట్సాఫ్ చెప్పాలిసిందే అంటున్నారు నెటిజన్స్. శవం కనిపిస్తే దూరం వెళ్లే జనం ఉన్న ఈ రోజుల్లో గుర్తు తెలియని శవాన్ని నదిలో నుంచి కిలోమీటర్ పైగా మోసి ఒడ్డుకు చేర్చడం అంటే మాములు విషయం కాదని అంటున్నారు నెటిజన్స్. రంగస్వామి లాంటి వ్యక్తులు అరుదుగా ఉంటారని.. ఇలాంటివారిని ప్రోత్సహిస్తే సమాజంలో మానవత్వం బతుకుతుందని అంటున్నారు.
