పబ్లిక్ ప్లేసుల్లో కుక్కలు మలవిసర్జన చేస్తే ఓనర్లే ఎత్తేయాలి.. హైదరాబాద్‌లో ఎంఎంసీ హెచ్చరిక

 పబ్లిక్ ప్లేసుల్లో కుక్కలు మలవిసర్జన చేస్తే ఓనర్లే ఎత్తేయాలి.. హైదరాబాద్‌లో ఎంఎంసీ హెచ్చరిక
  • పబ్లిక్​ప్లేసుల్లో కుక్కలు కక్కపోతే ఓనర్లే ఎత్తిపోయాలె 
  •     వెంట సంచులు     తీస్కపోవాలని సూచన
  •     లేకపోతే యాక్షన్ తీసుకుంటామన్న  ఎంఎంసీ


హైదరాబాద్ సిటీ, వెలుగు : పబ్లిక్​ప్లేసుల్లో పెంపుడు కుక్కలు మలవిసర్జన చేస్తే తీసేసి..ఆ వ్యర్థాలను సరైన రీతిలో పడేసే బాధ్యత కుక్కల యజమానులదేనని ఎంఎంసీ స్పష్టం చేసింది. పెంపుడు కుక్కల ఓనర్లు, బయటకు తీసుకెళ్లే వారు తప్పనిసరిగా ఈ రూల్స్​పాటించాలని ఇటీవల ఓ నోటీసు జారీ చేసింది. కుక్కలను బయటకు తీసుకువెళ్లినప్పుడు అవి పార్కులు, వాకింగ్ ట్రాక్‌‌లు, బస్టాప్ లు, కాలనీల రోడ్లు, ఫుట్‌‌పాత్‌‌లు, ఆటస్థలాలు, ఇతర పబ్లిక్​ప్లేసుల్లో మల విసర్జన చేస్తుండడం, అలాగే వదిలేస్తుండడంతో అపరిశుభ్రత ఏర్పడుతోందని పేర్కొంది.

దీన్ని నివారించడానికి కుక్కలను బయటకు తీసుకెళ్లే టైంలో అవి మలవిసర్జన చేస్తే తీసేసేందుకు వీలుగా సంచులను తీసుకెళ్లాలని సూచించింది. తీసిన వ్యర్థాలను సంచుల్లో వేసుకుని..మున్సిపల్ అధికారులు సూచించిన చెత్త డబ్బాల్లో వేయాలని స్పష్టం చేసింది. నిబంధనలు పాటించకపోతే యాక్షన్​తప్పదని 
హెచ్చరించింది.