IND vs WI 4th T20I: భారత్ వర్సెస్ వెస్టిండీస్ జట్ల మధ్య హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం (ఉప్పల్) వేదికగా అత్యంత కీలకమైన నాలుగో టీ20 మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన ఇండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ముందుగా బౌలింగ్ తీసుకున్నాడు. సిరీస్‌ను కైవసం చేసుకునేందుకు టీమిండియా అడుగు దూరంలో ఉండగా, విండీస్ జట్టు పోరాడి సిరీస్‌ను సమం చేయాలని చూస్తోంది.
భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. ఉప్పల్ స్టేడియం పిచ్‌ను పూర్తిగా పునరుద్ధరించడం (Relaided Surface) జరిగిందని, పిచ్ చాలా హార్డ్‌గా ఉండటం వల్ల మంచి బౌన్స్ లభిస్తుందని తెలిపాడు. విండీస్ బ్యాటింగ్ లైనప్ చాలా శక్తివంతమైనది కావడంతో వాళ్లని కట్టడి చేయాలనే లక్ష్యంతో బౌలింగ్ తీసుకున్నట్లు వెల్లడించాడు. గత మ్యాచ్‌లో ఆడిన పాత జట్టుతోనే (Same XI) బరిలోకి దిగుతున్నట్లు శ్రేయస్ స్పష్టం చేశాడు.
వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ మాట్లాడుతూ.. మేము కూడా టాస్ గెలిచి ఉంటే ముందుగా ఫీల్డింగ్ ఎంచుకునేవాళ్లం.. ఇది మాకు ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ (Must-win Game).. అందుకే తిరిగి పుంజుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బ్యాటింగ్‌లో జట్టుకు బలమైన పునాది వేసి, మా ప్రణాళికలకు ముందుకు తీసుకెళ్తాం, గ్రౌండ్ రియాక్షన్ ని బట్టి వేగంగా స్పందించాల్సి ఉంటుందని హోప్ తెలిపాడు.
వెస్టిండీస్: షాయ్ హోప్(వికెట్ కీపర్/కెప్టెన్), జ్యువెల్ ఆండ్రూ, షిమ్రాన్ హెట్మెయర్, రోవ్‌మన్ పావెల్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, రొమారియో షెపర్డ్, రోస్టన్ చేజ్, కీమో పాల్, షమర్ స్ప్రింగర్, గుడకేష్ మోతీ, షమర్ జోసెఫ్
భారత్: సంజు శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), తిలక్ వర్మ, నమన్ ధీర్, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్
🚨 Toss 🚨 #TeamIndia have won the toss & will bowl first in the 4️⃣th #INDvWI T20I. Updates ▶️ https://t.co/ksuQbTW6n5 @mflone_ https://t.co/UgqEljYIIE
— BCCI (@BCCI) October 14, 2026
