రైల్వే ఉద్యోగులు పండగ చేస్కోండి.. 78 రోజుల శాలరీని బోనస్గా ప్రకటించిన కేంద్రం

రైల్వే ఉద్యోగులు పండగ చేస్కోండి.. 78 రోజుల శాలరీని బోనస్గా ప్రకటించిన కేంద్రం

రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తంగా విధుల్లో ఉన్న 11 లక్షల 40 వేల 770 మంది రైల్వే ఉద్యోగులకు 78 రోజుల శాలరీని బోనస్గా ప్రకటించింది. ఇలా 2 వేల 9వందల కోట్లను రైల్వే ఉద్యోగులకు దీపావళి బోనస్గా ప్రకటిస్తూ కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. ఈ బోనస్ వల్ల ఒక్కో రైల్వే ఉద్యోగికి గరిష్టంగా 17వేల 951 రూపాయల డబ్బు క్రెడిట్ కానుంది.

నాన్ గెజిటెడ్ ఉద్యోగులను ఉద్దేశించి ఈ బోనస్ ప్రకటించారు. లోకో పైలట్లు, ట్రాక్ నిర్వహణ సిబ్బంది, రైలు మేనేజర్లు (గార్డులు), స్టేషన్ మాస్టర్లు, సూపర్‌వైజర్లు, టెక్నీషియన్లు, టెక్నీషియన్ హెల్పర్స్, -పాయింట్స్‌మెన్, రైల్వే మంత్రిత్వ శాఖ సిబ్బంది, -ఇతర గ్రూప్ 'సి' సిబ్బందికి ఈ బోనస్ మొత్తం అందనుంది. రైల్వే సిబ్బంది అద్భుతమైన పనితీరుకు గుర్తింపుగా ఈ ఏడాది బోనస్కు ఆమోదం తెలిపినట్లు క్యాబినెట్ పేర్కొంది.

ALSO READ : పీఎఫ్ విత్‌డ్రా రూల్స్ మార్పు

రైల్వేల పనితీరును మరింత మెరుగుపరిచేందుకు ఉద్యోగులను ప్రోత్సహించేందుకు ఈ బోనస్ ఒక ప్రోత్సాహకంగా ఉపయోగపడుతుందని రైల్వే శాఖ భావిస్తోంది. 2025-26లో రైల్వేలు దాదాపు 7.41 బిలియన్ల మంది ప్రయాణికులు ప్రయాణం చేశారు. రైల్వే సిబ్బంది రికార్డు స్థాయిలో 1,670 మిలియన్ టన్నుల సరుకును లోడ్ చేశారు. 78 రోజుల కాలపరిమితి మాత్రమే కాదు ప్రతి ఉద్యోగికి గరిష్ట పరిమితిలో కూడా గతేడాది బోనస్లో, ఈ ఏడాది ప్రకటించిన బోనస్లో ఎలాంటి మార్పు లేదు. గతేడాది కూడా గరిష్ట బోనస్ రూ. 17,951 గానే ఉంది.