రెబల్ స్టార్ ప్రభాస్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాక్సాఫీస్ దగ్గర వందల కోట్ల వసూళ్లు సాధించే ఈ పాన్ ఇండియా స్టార్.. తన మంచి మనసుతోనూ ఫ్యాన్స్ హృదయాలను గెలుచుకుంటుంటారు. ముఖ్యంగా ప్రభాస్ఆతిథ్యం గురించి సినీ ఇండస్ట్రీలో ఎన్నో ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తుంటాయి. షూటింగ్లో తనతో పాటు పనిచేసే నటీనటులు, టెక్నీషియన్లకు ఇంటి నుంచి రుచికరమైన వంటకాలు తెప్పించి విందు ఇవ్వడం డార్లింగ్‌కు అలవాటు. లేటెస్ట్ గా 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వికి అదిరిపోయే బర్త్‌డే సర్ప్రైజ్ ఇచ్చాడు..
ప్రభాస్ స్పెషల్ ట్రీట్..
'ఫౌజీ' సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న ఇమాన్వి పుట్టినరోజు అక్టోబర్ 13న జరిగింది. తన బర్త్‌డేను సింపుల్‌గా సెలబ్రేట్ చేసుకున్న ఈ బ్యూటీకి ప్రభాస్ మాత్రం మర్చిపోలేని కానుక ఇచ్చాడు. ఏదో ఒక గిఫ్ట్ పంపించి సరిపెట్టకుండా.. తనదైన స్టైల్లో నోరూరించే విందును సిద్ధం చేయించి ఆమెకు పంపించాడు. అదీ మామూలు విందు కాదు.. రకరకాల నాన్‌వెజ్ వంటకాలతో కూడిన స్పెషల్ ట్రీట్.
ఈ సర్ప్రైజ్కు ఫిదా అయిన ఇమాన్వి.. ఫుడ్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. 'కడుపు నిండిపోయింది ప్రభాస్ గారు' అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. దీంతో ప్రభాస్ ఇచ్చిన బర్త్‌డే ట్రీట్ ఇప్పుడు సినీ అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది.
హీరోయిన్స్ ఆతిథ్యానికి ఫిదా..
ఇది మొదటిసారి కాదు. గతంలో 'సాహో' సమయంలో శ్రద్ధా కపూర్, 'ఆదిపురుష్'లో కృతి సనన్, 'రాధేశ్యామ్' చిత్రీకరణ సమయంలో పూజా హెగ్డే కూడా ప్రభాస్ ఆతిథ్యాన్ని ఆస్వాదించిన సందర్భాలున్నాయి. ఇప్పుడు ఈ జాబితాలో ఇమాన్వి కూడా చేరింది. సినిమాల కోసం డైట్ పాటించే ప్రభాస్.. తనకు నచ్చిన భోజనం విషయంలో ఎంత ఇష్టంగా ఉంటాడో, ఇతరులకు విందు ఇవ్వడంలోనూ అంతే ఉదారంగా ఉంటాడనే మాట ఇండస్ట్రీలో వినిపిస్తుంటుంది.
ఎమోషనల్ బర్త్‌డే పోస్ట్..
మరోవైపు తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ఇమాన్వి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. ఇన్నేళ్లుగా అందిస్తున్న ప్రేమ, మద్దతుకు కృతజ్ఞతలు చెబుతూ.. కలలో కూడా నిజమవుతుందని అనుకోని జీవితాన్ని ఇప్పుడు జీవిస్తున్నందుకు ప్రతిరోజూ అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొంది. కళ ద్వారా ప్రేమను, వెలుగును పంచుతూ మరో ఏడాదిలోకి అడుగుపెడుతున్నానని తన ఆనందాన్ని పంచుకుంది.
ALSO READ : బాలీవుడ్ లోకి 'బేబమ్మ'గ్రాండ్ ఎంట్రీ.. బిగ్ లవ్ స్టోరీతో కృతి శెట్టి సందడి!
మొత్తానికి, ప్రభాస్ ఇచ్చిన స్పెషల్ ఫుడ్ ట్రీట్‌తో ఇమాన్వి బర్త్‌డే మరింత ప్రత్యేకంగా మారింది. తెరపై యాక్షన్‌తో అదరగొట్టే డార్లింగ్.. తెర వెనుక తన ఆతిథ్యంతోనూ అందరి మనసులు గెలుచుకుంటున్నాడు. ప్రభాస్‌తో సినిమా అంటే షూటింగ్ మాత్రమే కాదు, రుచికరమైన విందుల సందడి కూడా ఉంటుందనే టాక్ వినిపిస్తోంది..
