ఎన్నికల వేళ అఖిలేష్‎కు బిగ్ షాక్.. బీజేపీలో చేరిన ముగ్గురు SP ఎమ్మెల్యేలు

ఎన్నికల వేళ అఖిలేష్‎కు బిగ్ షాక్.. బీజేపీలో చేరిన ముగ్గురు SP ఎమ్మెల్యేలు

లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ సమాజ్‎వాదీ పార్టీ అధినేత, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్‎కు బిగ్ షాక్ తగిలింది. ఎస్పీ రెబెల్ ఎమ్మెల్యేలు రాకేష్ ప్రతాప్ సింగ్, అభయ్ సింగ్, వినోద్ చతుర్వేది బీజేపీలో చేరారు. బుధవారం (అక్టోబర్ 14) సీఎం యోగి సమక్షంలో ఈ ముగ్గురు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. 

రాకేష్ ప్రతాప్ సింగ్ అమేథీలోని గౌరీగంజ్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తుండగా.. అభయ్ సింగ్ అయోధ్యలోని గోసైన్‌గంజ్‌, వినోద్ చతుర్వేది జలౌన్‌లోని కల్పి అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యేలుగా ఉన్నారు. 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికలలో ఈ ముగ్గురు సమాజ్‎వాదీ పార్టీ టిక్కెట్లపై గెలిచారు. అనంతరం పార్టీ హైకమాండ్ పై తిరుగుబావుటా ఎగరేశారు. ఇందులో భాగంగానే 2024 రాజ్యసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థికి ఓటు వేశారు.

ALSO READ :  ఏపీలో అమల్లోకి ఎలక్షన్ కోడ్..

వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోన్న అఖిలేష్ యాదవ్‎కు ముగ్గురు పార్టీ సీనియర్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడం ఎదురు దెబ్బేనని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎస్పీ వర్గాలు మాత్రం ఈ అంశాన్ని లైట్ తీసుకుంటున్నాయి. ఆ ముగ్గురు ఎప్పటినుంచో బీజేపీతోనే ఉన్నారని.. ఇవాళ ఆ పార్టీలో జాయిన్ అయిన కూడా పెద్ద ప్రభావం ఏం ఉండదంటున్నారు. కాగా, 2027 ప్రారంభంలో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.