ఏపీలో లోకల్ వార్ కి కౌంట్ డౌన్ మొదలైంది. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. బుధవారం ( అక్టోబర్ 14 ) మున్సిపల్, జెడ్పీటీసి, ఎంపీటీసీ, గ్రామపంచాయితీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ అనౌన్స్ చేశారు SEC అనిల్ చంద్ర పునేఠా. మొత్తం 123 అర్బన్ బాడీస్ కి గాను 100 అర్బన్ బాడీస్ కు ఎన్నికల షెడ్యూల్ అనౌన్స్ చేశారు.
మొత్తం 100 అర్బన్ లోకల్ బాడీలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ అనౌన్స్ చేశారు అనిల్ చంద్ర పునేఠా. వీటిలో 77మున్సిపాలిటీలు, 13 కార్పొరేషన్లు 10 పంచాయతీలు, ఉన్నట్లు తెలిపారు. మున్సిపల్ ఎన్నికలకు ఈ నెల 28న పోలింగ్ నిర్వహించనుండగా.. 30న ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవాళే విడుదల కానుంది.
అర్బన్ బాడీస్ ఎన్నికల షెడ్యూల్:
- అక్టోబర్ 28న ఎన్నికలు, 30న ఫలితాలు
- అక్టోబర్ 16 నుంచి 18 వరకు నామినేషన్ల ప్రక్రియ
- 19న నామినేషన్ల పరిశీలన
- 21న నామినేషన్ల ఉపసంహరణ
- నవంబర్ 3న ఎంపీటీసీ, జెడ్పీటిసి ఎన్నికలు, 5న ఫలితాలు
ఎన్నికల షెడ్యూల్ వెలువడటంతో రాష్ట్రంలో ఎన్నికల హీట్ పీక్స్ కి చేరింది.
►ALSO READ | ఏపీలో నవంబర్ 3న MPTC, ZPTC ఎన్నికలు.. మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు
