విజయవాడ: ఏపీలో స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఆంధ్రాలో నవంబర్ 3న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల సంఘం ప్రకటించింది. నవంబర్ 5న ఫలితాలను వెల్లడిస్తారు. నవంబర్ 26న తొలి దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి. ఫలితాలు కూడా అదే రోజుల వెల్లడించడం జరుగుతుంది.
నవంబర్ 29న రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి. ఫలితాలు కూడా అదే రోజుల వెల్లడించడం జరుగుతుంది. డిసెంబర్ 2న మూడో దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి. ఫలితాలు కూడా అదే రోజుల వెల్లడించడం జరుగుతుంది.
