జర్మనీలో ఓ అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ముగ్గురు భారతీయులు మృతి

జర్మనీలో ఓ అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ముగ్గురు భారతీయులు మృతి

బోచమ్: జర్మనీలోని బోచమ్ సిటీలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో ముగ్గురు ఇండియన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనలో మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు యువతులు, ఓ యువకుడు ఉన్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. 

అపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని రెండో అంతస్తులో అగ్నిమాపక సిబ్బంది వీరి మృతదేహాలను గుర్తించారు. ప్రమాదంలో పొగ పీల్చడం వల్ల అస్వస్థతకు గురైన ఐదుగురిని వెంటనే స్థానిక ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు అదే భవనంలో నివసించే 41 ఏళ్ల రొమేనియా దేశస్తుడిని అనుమానంతో అరెస్ట్ చేశారు.