కూకట్ పల్లిలో వైశ్యరాజు జ్యువెలర్స్ షోరూమ్ ప్రారంభం

కూకట్ పల్లిలో వైశ్యరాజు జ్యువెలర్స్ షోరూమ్ ప్రారంభం

హైదరాబాద్, వెలుగు: కూకట్​పల్లి కేపీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీ రోడ్డులోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ పక్కన వైశ్యరాజు జ్యువెలర్స్ నూతన షోరూమ్ బుధవారం ఘనంగా ప్రారంభమైంది. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వ్యవస్థాపకుడు పొట్టి వెంకటేశ్వర్లు, ఎండీ సీర్న రాజమౌళి చేతుల మీదుగా ఈ షోరూమ్ ప్రారంభమవగా, జామి భోజరాజు తొలి కొనుగోలు చేశారు. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తమ సంస్థకు ఇది మూడో బ్రాంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అని ఎండీ వైశ్యరాజు భద్రగిరి రాజు తెలిపారు. 

ప్రారంభోత్సవ ఆఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా 22కేటీ బంగారు నగలపై ఫ్లాట్ 6% తరుగు, ఐజీఐ సర్టిఫైడ్ డైమండ్లు రూ.49,500 నుంచి అందుబాటులో ఉన్నాయి. సామాన్య వెండి వస్తువులపై తరుగు, మజూరి లేవు, జీఎస్టీని సంస్థే భరిస్తుంది. కేజీ వెండి కొనుగోలుపై రూ.15 వేల వరకు తగ్గింపు, "ఎంత బంగారం కొంటే అంత ఉచితం" (గరిష్టంగా రూ.4 లక్షల వరకు) అనే లక్కీ డ్రా ఆఫర్ అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో చైర్మన్ వైశ్యరాజు ఫల్గుణరాజు, డైరెక్టర్లు నరేశ్ రాజు, కిరణ్ కుమార్ రాజు పాల్గొన్నారు.