మెదక్– హైదరాబాద్ NHపై రోడ్డు పక్కన రెస్టారెంట్లలో ఫుడ్ తింటున్నారా..ముందే ఆస్పత్రిలో బెడ్ రిజర్వ్ చేసుకోండి..

మెదక్– హైదరాబాద్ NHపై రోడ్డు పక్కన రెస్టారెంట్లలో ఫుడ్ తింటున్నారా..ముందే ఆస్పత్రిలో బెడ్ రిజర్వ్  చేసుకోండి..
  • ఫుడ్ పాయిజన్ తో యువకుడి మృతి..
  • మరో 18 మందికి అస్వస్థత..
  • మెదక్ జిల్లా నర్సాపూర్​ లో ఘటన

మెదక్/ నర్సాపూర్​, వెలుగు: ఫుడ్ ఫాయిజన్ తో ఓ యువకుడు మృతిచెందగా, మరో 18 మంది అస్వస్థతకు గురైన ఘటన మెదక్​ జిల్లా నర్సాపూర్​లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. మెదక్​– హైదరాబాద్​నేషనల్​ హైవే పక్కన ఉన్న వన్​ ప్యాలెస్​ రెస్టారెంట్​లో ఈ నెల 12న నర్సాపూర్​కు చెందిన సాయిరాం (19) తన ఫ్రెండ్స్​తో కలిసి బిర్యానీ, రోటీ, కర్రీ తిన్నారు. 

మంగళవారం వారు వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురవడంతో వివిధ ఆస్పత్రులకు తరలించారు. సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సాయిరాం బుధవారం మృతిచెందాడు. ప్రస్తుతం 14 మంది నర్సాపూర్​ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 

జిల్లా ప్రభుత్వాస్పత్రుల సమన్వయ కర్త డాక్టర్​ శివదయాల్​ బుధవారం ఆస్పత్రిని సందర్శించి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. రెస్టారెంట్​ను తనిఖీ చేసిన ఫుడ్​ ఇన్​స్పెక్టర్​ స్వదీప్​కుమార్​ విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రంజిత్​రెడ్డి తెలిపారు. ఈ ఘటనపై నర్సాపూర్​ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.