అభిజీత్ దీప్కేకు అమెరికా నుంచి నిధులు : అమెరికన్ సింగర్ మేరీ మిల్బెన్

అభిజీత్ దీప్కేకు అమెరికా నుంచి నిధులు : అమెరికన్ సింగర్ మేరీ మిల్బెన్
  • యూఎస్​ సింగర్ ఆరోపణ

న్యూయార్క్: భారత ప్రధాని నరేంద్ర మోదీని, దేశ అభివృద్ధిని అడ్డుకోవడానికి కొన్ని విదేశీ శక్తులు ప్రయత్నిస్తున్నాయని అమెరికన్ సింగర్ మేరీ మిల్బెన్ ఆరోపించారు. అభిజీత్ దీప్కే, కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ)కి యూఎస్​కు చెందిన కొందరు ఫండింగ్ చేస్తున్నారని, దీనిని ఇండియాలో ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి వాడుతున్నారని ట్విట్టర్​లో పేర్కొన్నారు. ఈ కుట్రలను తిప్పికొట్టడానికి భారత యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ‘సైలెంట్​గా ఉండాల్సిన టైం కాదిది. ప్రధానమంత్రికి వ్యతిరేకంగా ఉన్న అమెరికాలోని దాతలు నిధులు సమకూరుస్తున్నారు. 

మోదీ నాయకత్వంలో యువత భవిష్యత్తు సేఫ్​గా ఉంది. భయపడకండి. సీజేపీ వంటి విద్రోహ శక్తుల వైఖరికి వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన చేయాలి. ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి కౌంటర్​మూమెంట్​ చేపట్టాలి’ అని సూచించారు. మిల్బెన్ 2022లో  ఇండియా 75వ ఇండిపెండెన్స్​డే వేడుకల సమయంలో స్పాట్​లైట్​లోకి వచ్చారు. 2023లో మోదీ యూఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సందర్శించినప్పుడు ఆమె భారత జాతీయ గీతాన్ని పాడారు.