హైదరాబాద్‌‌‌‌లో విమాన క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటు

హైదరాబాద్‌‌‌‌లో విమాన క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటు
  • జీఎంఆర్ ఏరో టెక్నిక్‌‌‌‌- యూడీఎస్ ఏరో మధ్య కీలక ఒప్పందం

గండిపేట, వెలుగు: భారత విమాన రంగంలో నిర్వహణ, రిపేర్లు, ఓవర్‌‌‌‌హాల్ (ఎంఆర్‌‌‌‌ఓ) సేవలు అందిస్తున్న సంస్థ జీఎంఆర్ ఏరో టెక్నిక్‌‌‌‌, ఫ్రాన్స్‌‌‌‌కు చెందిన ఏరోస్పేస్ దిగ్గజం యూడీఎస్ ఏరోతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం ద్వారా హైదరాబాద్‌‌‌‌లోని జీఎంఆర్ ఏరో టెక్నిక్ కేంద్రంలో ‘క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్’ను ఏర్పాటు చేయాలని రెండు సంస్థలు నిర్ణయించాయి.

విమానాల క్యాబిన్ అంతర్గత భాగాల రూపకల్పన, ఇంజినీరింగ్‌‌‌‌, ధ్రువీకరణ, తయారీ, అమరిక, రిపేర్లు, పునరుద్ధరణ వంటి అన్ని సేవలను ఒకే వేదికపై అందించడం ఈ కేంద్రం ప్రధాన లక్ష్యమని రెండు సంస్థల అధికారులు వెల్లడించారు.

యూరోపియన్ యూనియన్ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీ (ఈఏఎస్ఏ) నుంచి కీలక అనుమతులు పొందిన యూడీఎస్ ఏరో నైపుణ్యాలను, జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఎంఆర్‌‌‌‌ఓ మౌలిక సదుపాయాలతో అనుసంధానించడం ద్వారా విమాన సంస్థలకు అత్యాధునిక సాంకేతిక పరిష్కారాలను అందించనున్నారు. యూడీఎస్ ఏరోతో ఒప్పందం తమ క్యాబిన్ అంతర్గత సేవల విస్తరణలో ఒక కీలక మైలురాయిగా నిలుస్తుందని జీఎంఆర్ ఏరో టెక్నిక్ ప్రెసిడెంట్ అశోక్ గోపీనాథ్ తెలిపారు.

భారత్‌‌‌‌తో పాటు అంతర్జాతీయ మార్కెట్లలో వినియోగదారులకు అధిక నాణ్యతతో కూడిన సేవలు అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. హైదరాబాద్‌‌‌‌లో సమగ్ర క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్‌‌‌‌తో జతకట్టడం సంతోషంగా ఉందని యూడీఎస్ ఏరో గ్రూప్ సిటీఓ అషేన్ గుణరతి వ్యాఖ్యానించారు.