నా పేరు మీద అసైన్డ్ భూమిఉంటే రాసిస్తా : ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

నా పేరు మీద  అసైన్డ్ భూమిఉంటే రాసిస్తా : ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: తన పేరు మీద ఎక్కడా.. ఎలాంటి అసైన్డ్ భూమి లేదా 22ఏ జాబితాలో , అక్రమంగా సెంటు భూమి ఉన్నా, అక్కడే అధికారులను పిలిచి రాసిస్తానని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం గాంధీభవన్‌లో  మీడియాతో ఆయన మాట్లాడారు. తెలంగాణ సమాజానికి విలన్‌గా చూపించాలని బీఆర్ఎస్ నేత ఆర్‌‌ఎస్ ప్రవీణ్ కుమార్ తనపై తప్పుడు ఆరోపణలు చేశారని తెలిపారు. 

ఏనుగు ఎక్కి ప్రగతి భవన్‌కు వెళ్తానని చెప్పిన వ్యక్తి..ఇప్పుడు ఫాంహౌస్‌లో బందీ అయ్యారని ఆరోపించారు. బీఆర్ఎస్ నేతల ఫామ్‌హౌస్ భాగోతాలను బయటపెట్టడంతోనే తనపై కేటీఆర్, గుండు రావు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.