రైతులకు 8 గంటల కరెంటే ఇస్తున్నరు! : హరీశ్ రావు

రైతులకు 8 గంటల కరెంటే ఇస్తున్నరు! : హరీశ్ రావు
  •     బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా ఎక్కడా అమలు కావడం లేదని, వ్యవసాయానికి కనీసం 8 గంటల కరెంట్ కూడా అందడం లేదని మాజీ మంత్రి,  బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు ఆరోపించారు. గట్టు సబ్‌‌‌‌‌‌‌‌స్టేషన్ అధికారిక లాగ్‌‌‌‌‌‌‌‌బుక్కే కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి ప్రత్యక్ష సాక్ష్యమని ఆయన విమర్శించారు. బుధవారం గద్వాల నియోజకవర్గంలోని గట్టు మండలంలో సాగునీరు, విద్యుత్ అందక ఎండిపోతున్న పంట పొలాలను హరీశ్‌‌‌‌‌‌‌‌రావు స్వయంగా పరిశీలించారు. 

అనంతరం గట్టు మండల విద్యుత్ సబ్‌‌‌‌‌‌‌‌స్టేషన్‌‌‌‌‌‌‌‌ను సందర్శించి అక్కడి అధికారిక రికార్డులను, లాగ్‌‌‌‌‌‌‌‌బుక్‌‌‌‌‌‌‌‌ను తనిఖీ చేశారు. సబ్‌‌‌‌‌‌‌‌స్టేషన్ రికార్డుల ప్రకారం అక్టోబర్ 13న రైతులకు ఇచ్చిన త్రీఫేస్ కరెంట్ కేవలం 7 గంటల 50 నిమిషాలు మాత్రమేనని ఆయన వెల్లడించారు. రైతులకు 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న రేవంత్ సర్కార్, కనీసం 8 గంటలు కూడా ఇవ్వలేకపోతోందని హరీశ్‌‌‌‌‌‌‌‌రావు మండిపడ్డారు.