న్యూఢిల్లీ, వెలుగు: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్)పై ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సంబంధిత పిటిషన్ను ఆయన తరఫు అడ్వొకేట్ నిజాముద్దీన్ పాషా బుధవారం సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం ముందు మెన్షన్ చేశారు. దీనిపై సీజేఐ స్పందిస్తూ.. పిటిషన్ను పరిశీలించి, సర్ ప్రక్రియపై దాఖలైన ఇతర పిటిషన్లతో జత చేస్తామని తెలిపారు.
కాగా, ఇటీవల లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఇండియా బ్లాక్ నాయకులు సౌగతా రాయ్(టీఎంసీ), అఖిలేశ్యాదవ్(సమాజ్వాదీ పార్టీ), సుప్రియా సూలే(ఎన్సీపీ), తేజస్వీ ప్రసాద్ యాదవ్(ఆర్జేడీ), సంజయ్ రౌత్(శివసేన యూబీటీ), ఎంఏ బేబీ(సీపీఐ-ఎం), డి.రాజా(సీపీఐ), మహుయాద్(సీపీఐ), ముహమ్మద్ బషీర్(ఐయూఎంఎల్) ‘సర్’ను సవాల్ చేస్తూ పిటిషన్లు వేశారు.
