పాడైన చేతి పంపులు, బోర్ల రిపేర్లు..హైదరాబాద్లో 3 వేల వరకు ఉంటాయని అంచనా

పాడైన చేతి పంపులు, బోర్ల రిపేర్లు..హైదరాబాద్లో 3 వేల వరకు ఉంటాయని అంచనా
  • మరమ్మతు చేసి ఆ ప్రాంతాలకే నీళ్లిచ్చే యోచన
  • నీటి కొరత కొంతయినా తీరుతుందని ప్లాన్

హైదరాబాద్ సిటీ, వెలుగు : ఎల్ నినో ఎఫెక్ట్​తో వాటర్​బోర్డుపై తీవ్రమైన భారం పడుతున్నది. వర్షాల్లేక ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు తగ్గుతుండడం, బోర్లు ఎండిపోతుండడంతో హైదరాబాద్​లో వాటర్​ ట్యాంకర్ల బుకింగ్స్​పెరిగిపోతున్నాయి. దీంతో సరఫరా కష్టంగా మారుతుండడం, రాను రాను సమస్య తీవ్రమయ్యే అవకాశం ఉండడంతో వాటర్​బోర్డు ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించింది. 

నీటి కొరతను కొంతమేరైనా తగ్గించే ప్రణాళికలో భాగంగా సిటీలో నిరుపయోగంగా ఉన్న బోర్లు, బోరింగ్‌‌‌‌లను(చేతి పంపులు) రిపేర్లు చేయించి తిరిగి వినియోగంలోకి తీసుకురావాలని ప్లాన్​వేసింది. జీహెచ్‌‌‌‌ఎంసీ, జలమండలి గతంలో వివిధ ప్రాంతాల్లో వేసిన ఇలాంటి బోర్లు, బోరింగ్‌‌‌‌లు సుమారు 3 వేల వరకు ఉంటాయని అంచనా.. వీటిలో ప్రస్తుతం ఎన్ని పనిచేస్తున్నాయి? 

ఎన్ని రిపేర్లకు అనుకూలంగా ఉన్నాయి? ఎక్కడెక్కడ నీటి లభ్యత ఉంది? అనే అంశాలను పరిశీలించి, అందుబాటులో ఉన్న బోర్లను వినియోగంలోకి తీసుకురానున్నారు. పని చేస్తే అక్కడే ట్యాంక్ లు నిర్మించి చుట్టుపక్కల ప్రాంతాల వారికి నీళ్లు అందించే ఆలోచన చేస్తున్నారు. 

ట్యాంకర్లపై ఆధారాన్ని తగ్గించేలా..

నగరంలోని చాలా ప్రాంతాల్లో భూగర్భ జలాలు తగ్గిపోవడంతో జలమండలి ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు. అలాగే, మురికివాడలు, నీటి సరఫరా సరిగ్గా అందని కాలనీలకు వాటర్​బోర్డు ఉచితంగా ట్యాంకర్లను సరఫరా చేస్తోంది. ఈ తాగునీటిని చాలామంది ఇతర అవసరాల కోసం కూడా వాడుతున్నారు.  

దీంతో ఆయా కాలనీల్లో గతంలో వేసిన బోర్లు, బోరింగులు ఉండడంతో అవి పని చేస్తున్నాయా లేదా తెలుసుకునే పనిలో పడ్డారు.. గ్రౌండ్​వాటర్ ​అందుబాటులో ఉన్న వాటిని రిపేర్​చేయించి ఆ నీటిని అక్కడిప్రాంతాల వారికే అందించనున్నారు.