డెక్కన్ సరాయ్ హోటల్ తో కేటీఆర్ దందా : విప్ బల్మూరి వెంకట్

డెక్కన్ సరాయ్ హోటల్ తో కేటీఆర్ దందా : విప్ బల్మూరి వెంకట్

హైదరాబాద్, వెలుగు: కేటీఆర్ నయా దందా మొదలు పెట్టారని, రూ.5 కోట్ల షేర్ విలువ ఉన్న  ఆయన డెక్కన్ సరాయ్ హోటల్ ఆదాయం పదేళ్లలో రూ.175 కోట్లకు ఎలా పెరిగిందని విప్ బల్మూరి వెంకట్ నిలదీశారు. బుధవారం ఆయన​ సీఎల్పీలో మీడియా సమావేశంలో మాట్లాడారు. 

కేటీఆర్ హోటల్ ఆదాయం రోజుకు రూ.75 లక్షలు అని, ఐటీ మంత్రిగా ఉన్న సమయంలోనే ఎంఎన్‌‌‌‌సీ కంపెనీలను బెదిరించి సెరాయ్ హోటల్ నుంచే అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ ను సప్లయి చేసి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. తాను చేసిన ఆరోపణలకు ఎప్పుడైనా.. ఎక్కడైనా చర్చకు సిద్ధమని, కేటీఆర్ కు దమ్ముంటే తన ఆరోపణలపై స్పందించాలని డిమాండ్ చేశారు.