ఏడుకొండల వాడి దర్శనానికి వెళ్లాలనుకునే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక సమాచారం ఇచ్చింది. 2027 జనవరి నెలకు సంబంధించిన వివిధ ఆర్జిత సేవలు, ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, వసతి గదుల కోటాను ఆన్‌లైన్‌లో రిలీజ్ చేశారు. అలాగే తిరుమల, తిరుపతిలలో గదుల కోటాను అక్టోబర్24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ అధికారులు తెలిసారు
తిరుమలకు ప్రయాణం ప్లాన్ చేసుకునే భక్తులు ఎప్పటికప్పుడు తేదీలను, సమయాలను చెక్ చేసుకుని ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ కోరింది. ఆన్‌లైన్ కోటా విడుదలయ్యే సమయానికి విపరీతమైన రష్ ఉండే అవకాశం ఉన్నందున, భక్తులు తమ వివరాలను ముందే రెడీగా ఉంచుకోవడం మేలని సూచించింది.
