ఐపీఎల్ 2027 (IPL 2027) వేలానికి ముందు ముంబై ఇండియన్స్ (Mumbai Indians) యాజమాన్యం తమ కోచింగ్ స్టాఫ్‌లో బిగ్ చేంజ్ చేసింది. ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచిన ముంబై జట్టు, ఇప్పటి వరకు హెడ్ కోచ్‌గా ఉన్న మహేళ జయవర్ధనేతో (Mahela Jayawardene) గుడ్ బై చెప్పడంతో, ఆ స్థానంలో జట్టు మాజీ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్‌ను (Kieron Pollard) కొత్త హెడ్ కోచ్‌గా నియమించింది. గతంలో ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ కోచ్‌గా వ్యవహరించిన పొలార్డ్, ఇప్పుడు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు.
హెడ్ కోచ్‌గా పొలార్డ్కి ప్రమోషన్:
* ఫ్రాంచైజీ లెజెండ్: 2010 నుంచి 2022 వరకు ముంబై ఇండియన్స్ తరఫున మాత్రమే ఆడిన కిరన్ పొలార్డ్, ఆ జట్టు గెలిచిన ఐదు టైటిళ్లలో (2013, 2015, 2017, 2019, 2020) కీలక పాత్ర పోషించారు. 211 మ్యాచ్‌ల్లో 3,915 రన్స్ చేయడమే కాకుండా 79 వికెట్లు, అత్యధికంగా 113 క్యాచ్‌లు పట్టారు.
* రెండో హెడ్ కోచ్ బాధ్యత: పొలార్డ్‌కు ప్రధాన కోచ్‌గా ఇది రెండో అసైన్మెంట్. 2026 జనవరిలోనే ముంబై ఇండియన్స్ సిస్టర్ ఫ్రాంచైజీ అయిన ది హండ్రెడ్ టోర్నీకి చెందిన ఎంఐ లండన్ (MI London) టీమ్ హెడ్ కోచ్‌గా ఆయన సెలక్ట్ అయ్యారు.
ముంబై టీమ్ ఫ్యామిలీకి ధన్యవాదాలు: పొలార్డ్
కోచ్‌గా ఎంపికైన సందర్భంగా పొలార్డ్ మాట్లాడుతూ.. ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ గా బాధ్యతలు స్వీకరించడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను.. ముంబై జట్టు నా జీవితంలో, కెరీర్‌లో భాగం.. నాపై నమ్మకం ఉంచిన నీతా అంబానీ, ఆకాశ్ అంబానీలకు ధన్యవాదాలు. అభిమానుల ముఖాల్లో మరిన్ని నవ్వులు నింపడానికి శ్రమిస్తానని పేర్కొన్నాడు.
ఐపీఎల్ 2026 నిరాశతో జట్టులో మార్పులు:
ఐపీఎల్ 2026లో హార్దిక్ పాండ్యా నాయకత్వంలోని ముంబై ఇండియన్స్ జట్టు తీవ్రంగా నిరాశపరిచింది. 14 మ్యాచ్‌ల్లో కేవలం 4 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో నిలిచింది. దీంతో హెడ్ కోచ్‌గా జయవర్ధనేను తప్పించి పొలార్డ్‌కు పగ్గాలు అప్పగించారు. ఐపీఎల్ 2027 మినీ వేలానికి ముందు ముంబై జట్టులో కెప్టెన్సీ మార్పుతో పాటు ప్లేయర్లలో కూడా భారీ మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
